Naming cermony for dogs in karimnagar

naming cermony for dogs, dogs naming cermony, dogs names, dogs cute sweet names, dogs diseases and food, latest updates, infertility problems, infertility treatment, latest updates, karimnagar news, telangana news

naming cermony for dogs in karimnagar : in karimnagar district vavilapally a family had no children their dog delivered four puppys so the family celebrated naming cermony to puppies and given party to relatives

కరీంనగర్ లో కుక్కపిల్లలకు బారసాల

Posted: 10/20/2014 03:53 PM IST
Naming cermony for dogs in karimnagar

మనుషుల గురించే పట్టించుకోని ఈ రోజుల్లో పెంపుడు కుక్కలకు ఘనంగా బారసాల నిర్వహించిందో కుటుంబం. తమకు బిడ్డలు లేని లోటును కుక్కపిల్లల ద్వారా తీర్చుకుని.., వాటినే తమ పిల్లలుగా భావిస్తుందో ఫ్యామిలి. కరీంనగర్ జిల్లా వివిలాలపల్లికి చెందిన రవి దంపతులకు పిల్లలు లేరు. ఆయనకు కుక్కలంటే ఎంతో అభిమానం.. రవి పెంచుకుంటున్న కుక్క ఈ మద్య ప్రసవించగా నాలుగు పిల్లలు పుట్టాయి. తనకు ఎలాగు పిల్లలు లేరు కాబట్టి వాటినే తన పిల్లలుగా భావించాడు.

తనకు పిల్లలు పుడితే ఎలా పేరుపెట్టే కార్యక్రమం నిర్వహిస్తాడో కుక్క పిల్లలకు కూడా అలాగే ఘనంగా బారసాల కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బంధువులను పిలవటం, ఫ్లెక్సీలపై ఫొటోలు వేసి.. ఇంటిని అందంగా అలంకరించారు. కూనలకు కొత్త బట్టలు తెచ్చి నానా హంగామా చేసి ఘనంగా బారసాల జరిపించారు. ఇంటికి వచ్చిన బంధువులు కూనలను ఆశీర్వదించి..., వింధుభోజనం ఆరగించి మరీ వెళ్లారు.

ఇలా పిల్లలు లేకపోయినా.., పెంపుడు కుక్క పిల్లలనే తన సొంత బిడ్డలుగా భావిస్తున్న రవి కుటుంబాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. భగవంతుడు కరుణించకపోయినా రవి కూనలపై జాలి చూయిస్తున్నాడు అని ప్రశంసిస్తున్నారు. మానవత్వానికి.., మంచి తనానికి మారుపేరుగా నిలిచిన రవి అతని ఫ్యామిలికి హ్యాట్సాఫ్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : infertility  dogs  naming cermony  latest updates  telangana  

Other Articles