Little apple song of chinese movie old boys the way of the dragon become very popular

little apple song, little apple song by little apple chopstick brothers, little apple song in old boys movie, old boys china movie, world popular songs, most popular songs in the world, latest updates, evergreen songs, latest movie updates

little apple song of chinese movie Old Boys : a song in chinese movie old boys the way to dragon become very popular in china also in other countries this song created sensations like gangnam style song

‘గంగ్నమ్ స్టైల్’ తరహాలో ఊపేస్తున్న చైనా సాంగ్

Posted: 10/20/2014 01:40 PM IST
Little apple song of chinese movie old boys the way of the dragon become very popular

అనుకోకుండా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే ప్రపంచ గుర్తింపు పొందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ మద్య దక్షిణ కొరియాకు చెందిన సై ‘గంగ్నమ్ స్టైల్’ అనే పాటతో ప్రపంచాన్నే ఉర్రూతలూగించాడు. ఆ పాట ఆన్ లైన్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఇప్పటికీ ప్రజల నోట పలుకుతోంది. ఇప్పుడిలాగే ఓ పాట చైనాలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. అదే ‘‘ ఓల్డ్ బాయ్స్ : ద వే ఆఫ్ డ్రాగన్’’ సినిమాలోని ‘లిటిల్ ఆపిల్’ పాట. కేవలం సినిమా ప్రమోషన్ కోసం తీసిన ఈ పాట ‘సోహు, యౌకు, ఇకుయి’ వంటి చైనా వీడియో సైట్లలో సంచలనాలు సృష్టిస్తుంది.

చాప్ స్టిక్ బ్రదర్స్ పేరిట జియావో యాంగ్, వాంగ్ తైలి ఈ పాటను రూపొందించారు. ఈ ఏడాది జులైలో ‘ఓల్డ్ బాయ్స్’ సినిమా విడుదల కాగా.., మూవీ కంటే పాట ఎక్కువ ప్రజాదరణ పొందింది. క్యాచీగా ఉండే ట్యూన్స్, విచిత్రమైన పదాలతో మనం చదువుకున్న ‘ఈవ్- ఆదం’ యాపిల్ కధ గురించి చెప్తూ పాట సాగుతుంది. ఇప్పటికే ఈ పాట ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ పాపులర్ సాంగ్ మీకోసం అందిస్తున్నాం.

ప్రస్తుతం చైనాలో ఈ పాటకు వస్తున్న క్రేజ్ చూసి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ పాటను వినియోగించుకుంది. ఇక షాంగ్ డాండ్ పోలిసులు ఫోన్ బ్యాంకింగ్, ఇతర స్కాంలపై హెచ్చరికల కోసం ఈ పాటను వినియోగించారు. ఇలా పలు వర్గాల వారు ఈ పాపులర్ పాటను పదాలు మార్చి, పేరడి చేసి ఉపయోగించుకుంటున్నారు. అదండీ ‘లిటిల్ ఆపిల్’ సాంగ్ బిగ్ పాపులర్ కధ. మీరూ ఏదైనా కొత్తగా ఉంటే ప్రయత్నించండి. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : little apple  old boys  chopstick brothers  latest updates  

Other Articles