Thief returned stolen 15lakhs to owner in madhyapradesh

thiefs, good thievs in india, thievs in india, thieves behaviour, latest updates, theft cases, madhyapradesh news, india latest crime news, interesting news in india, funny news in india, money bags

thief returned stolen 15lakhs to owner in madhyapradesh : a thief named kamalesh stolen bag having 15lakhs rupess from a business man after one week he called owner of bag and given him money back

రూ.15లక్షలు తిరిగిచ్చేసిన మంచిదొంగ

Posted: 10/20/2014 04:40 PM IST
Thief returned stolen 15lakhs to owner in madhyapradesh

రోడ్డుపై పది రూపాయల నోటు పడితేనే వెనకా ముందు చూడకుండా జేబులో వేసుకుని వెళ్ళే రోజులివి. అలాంటిది దొంగతనాలే ప్రవృత్తిగా పెట్టుకున్న ఓ దొంగ.., తాను దొంగతనం చేసిన పదిహేను లక్షల రూపాయలను తిరిగి ఇచ్చేశాడు. డబ్బుల యజమాని, పోలిసులు విస్తుపోయిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పూర్తి వివరాలు చూస్తే.., భోపాల్ లోని లక్ష్మణ్ మునిలాల్ చందాని స్థానికంగా పనిముట్లు విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. బైరాగఢ్ మార్కెట్ లో ఉన్న తన షాపు నుంచి రోజు లాగానే డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా.., గత మంగళవారం డబ్బుల సంచిని ఓ దొంగ కొట్టేశాడు.

అందులో రూ. 15లక్షల డబ్బు ఉంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలిసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విస్రృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించటంతో పాటు స్థానికుల వద్ద ఆధారాలను సేకరించారు. అటు డబ్బు పోయిన బాధలో లక్ష్మణ్ కుటుంబం ఉంది. ఇవన్ని ఇలా ఉండగా.., ఆదివారం రోజు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అందులోని సారాంశం ఏమంటే.., తన పేరు కమలేష్ అని మంగళవారం రోజు బ్యాగు కొట్టేసింది తానే అని చెప్పాడు. దొంగతనం చేసిన వ్యక్తి నేరుగా ఫోన్ చేయటంతో లక్ష్మన్ మూని లాల్ షాకయ్యాడు.

అయితే తాను దొంగతనం చేసిన బ్యాగును మాంఝీ నగర్ లోని ఓ ఇంట్లో ఉంచానని..., అందులో డబ్బు కూడా ఉందని వెంటనే వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి పెట్టేశాడు. ఇది విన్న లక్ష్మణ్ ముని లాల్ ఆశ్చర్యం వ్యక్తం చేయటంతో పాటు ఒకింత ఆనందపడ్డాడు. విషయం పోలిసులకు తెలపగా.., వారు కూడా వెంట వచ్చారు. చాలా సేపు వెతికిన తర్వాత ఓ పాడుబడ్డ ఇంట్లో బ్యాగు లభించింది. సంచి తెరిచి చూస్తే అందులో తన డబ్బు యదాతధంగా ఉంది. దీంతో వ్యాపారి కళ్లలో ఆనందం వెళ్ళివిరిసింది.

ఇక ఈ దొంగతనంపై ధర్యాప్తు చేపట్టిన పోలిసులు డబ్బు దొరకటంతో ఊపిరి పీల్చుకున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేపట్టడంతో భయపడిపోయి డబ్బులు అప్పగించినట్లు పోలిసులు చెప్తున్నారు. డబ్బుపై సమాచారం ఇచ్చిన ఫోన్ నద్రా బస్టాండ్ లోని ఓ టెలిఫోన్ బూత్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ ఫోన్ ఎవరు చేశారు అనే అంశంపై ప్రస్తుతం ధర్యాప్తు చేస్తున్నారు. ఇలా దొంగతనం చేసిన వ్యక్తి భయం కారణమో.. లేక తనలో కలిగిన పశ్చాత్తాపమో తెలియదు కాని డబ్బు ఇవ్వటం మాత్రం నిజంగా అరుదు అని చెప్పాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thief  money  madhyapradesh  latest updates  

Other Articles