Diesel price is likely to be cut rs 2 50 a litre

Diesel Price, Dharmendra Pradhan, Assembly Elections, Election code

diesel price is likely to be cut rs 2-50 a litre

దిగిరానున్నడీజిల్ ధర..!

Posted: 10/15/2014 08:07 AM IST
Diesel price is likely to be cut rs 2 50 a litre

అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గతుండడంతో డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. మన దేశంలోనూ డీజిల్ ధరలను తగ్గించాలని ఇంధన సంస్థలు ప్రతిపాదించినట్లు సమాచారం. లీటర్ డీజిల్ ధర 2.50 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండటం కారణంగా డీజిల్ రేటు తగ్గింపుకు అవరోధంగా మారింది. దీంతో పాటు పెట్రోల్ ధరను కూడా తగ్గించే అవకాశాలు వున్నాయని సమాచారం.

యూపీఏ ప్రభుత్వ హయాంలో.. డీజిల్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని భావించింది. ఇందుకు అనుగూణంగా ప్రతీ నెల యూభై పైసల నుంచి రూపాయి వరకు డీజిల్ ధరలను పెంచుకునే వెసలుబాటును అప్పటి కేంద్ర క్యాబినెట్ ఇంధన సంస్థలకు కల్పించింది. దీంతో గత రెండేళ్లుగా పెరుగుతూ వచ్చిన డీజిల్ ధర.. తొలిసారిగా తగ్గనుంది. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు తగ్గడమే ఇందుకు కారణంగా చమురు సంస్థలు వెల్లడిస్తున్నాయి. డీజిల్ ధర తగ్గింపుతో అన్ని రకాల నిత్యావసరాల ధరలు కూడా క్రమంగా దిగివస్తాయి. ముఖ్యంగా రవాణా చార్జీలు తగ్గడంతో ఆహారోత్పత్తుల ధరలు అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ఫలించనున్నాయి.
 
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉందని.. ఈ సమయంలో డీజిల్ ధరపై తాను ఎలాంటి వ్యాఖ్యాలు చేయలేనని కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంధ్రప్రధాన్ తెలిపారు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని డీజిల్ ధరల తగ్గింపు అంశంపై పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అక్టోబరు 19 తర్వాత డీజిల్ ధర తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు

జి,మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diesel Price  Dharmendra Pradhan  Assembly Elections  Election code  

Other Articles