Family members dad and 4 sons killed daughters lover and try to kill her also

uttar pradesh crime news, lovers crime, family members killed daughters lover, lovers romance, moradabad rural sp, rakesh singh sushma crime news, lovers rakesh singh sushma, rakesh singh murder, rakesh singh killed

family members dad and 4 sons killed daughters lover and try to kill her also

బెడ్ రూమ్ లో లవర్స్ రొమాన్స్.. ప్రతాపం చూపిన పెద్దలు!

Posted: 10/14/2014 09:42 PM IST
Family members dad and 4 sons killed daughters lover and try to kill her also

ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అభ్యంతకరమైన రీతిలో పట్టుబడిన ప్రేమికులపై పెద్దలు తమ ప్రతాపం చూపించేశారు. ప్రియుడిని ఉరేసి చంపేశారు... ప్రియురాలి నోట్లో విషయం పోశారు. ఆ తర్వాత దుండగులు కనిపించకుండా పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ జిల్లా భర్తాల్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

రాకేష్ సింగ్(17), సుష్మ(15) ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబసభ్యులకు తెలియకుండా రహస్యంగా కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా.. సుష్మ తండ్రి మఖాన్ సింగ్, అతని నలుగురు కుమారులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమైద్ లకు తమింట్లో కంటపడ్డారు. అంతే... తమ పిల్ల పరాయివ్యక్తితో కనబడటంతో వాళ్లందరూ కోపంతో రగిలిపోయారు. ఒక్క నిముషం ఆలోచించకుండా వాళ్లు రాకేష్ సింగ్ ను ఉరేసి చంపేశారు. తర్వాత సుష్మతో బలవంతంగా విషం తాగించారు. అనంతరం అక్కడి నుంచి ఎవరికీ తెలియకుండా పరారయ్యారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకునే సరికి రాకేష్ చనిపోగా.. చావుబతుకుల్లో వున్న సుష్మను ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న రాకేష్ తండ్రి.. తన కుమారుడిని ఇనుప రాడ్ తో కొట్టి, తర్వాత ఉరేసి చంపారని ఆరోపించారు. సుష్మ కుటుంబసభ్యులు పరువుహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇదిలావుండగా.. ఈ హత్యకు ప్రత్యక్షసాక్షి అయిన సుస్మ పరిస్థితి చాలా విషమంగా వుండటంతో పోలీసులకు ఆమె వాంగ్మూలం తీసుకోవడం సాధ్యం కాలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని మొరదాబాద్ ఎస్పీ తెలిపారు. రాకేష్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lovers crime  uttar pradesh crime news  rakesh singh sushma lovers  

Other Articles