Court given death punishment for saanvi death convited

saanvi death case, saanvi death mystery, saanvi death case judgement, saanvi venna death case updates, saanvi death case mystery, latest updats, america news, telugu people in america, yandamuri raghunandan, raghunandan death, raghunandan in saanvi case, punishment for yandamuri raghunandan, latest telugu news, telugu latest updates, satyavathi venna, satyavathi death, satyavathi death case, satyavathi death mystery, saanvi and satyavathi death mystery, america police, america telugu latest updates, world news, crimes, murders, mysterious murders, mystery deaths, latest updates, death punishment, court judgements, death punishment judgements

america's court given capital punishment of hanging in the death case of sanvi and her grandmother happend in august 2013 : Montgomery County district court given death punishment to raghunandan who convicted in savi venna and satyavathi venna death case

శాన్వి, సత్యవతి హంతకుడికి ఉరిశిక్ష - అమెరికా కోర్టు

Posted: 10/15/2014 09:20 AM IST
Court given death punishment for saanvi death convited

అమెరికాలో గతేడాదిలో సంచలనం రేపిన చిన్నారి శాన్వీ హత్య కేసులో యంమూరి రఘునందన్ కు కోర్టు శిక్ష విధించింది. శాన్వీతో పాటు ఆమె నాన్నమ్మ సత్యవతిని హత్యచేసినట్లు యండమూరి రఘునందన్ పై ఆరోపణలు నిర్ధారణ కావటంతో దోషికి మరణ శిక్ష విధిస్తూ మాంటగొమెరీ జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.., గతేడాది అక్టోబర్ 22న అనుమానాస్పద స్థితిలో శాన్వి వెన్న ఆమె నాన్నమ్మ సత్యవతి వెన్న దారుణ హత్యకు గురయ్యారు. ముందుగా సత్యవతి మృతదేహంను గుర్తించిన పోలిసులు.. ఇంటిలో ఓ బెదిరింపు లేఖను కనుగొన్నారు. శాన్విని అప్పగించాలంటే 50వేల డాలర్లు ఇవ్వాలని లేఖలో ఉంది. దీంతో అమ్మాయి కిడ్నాప్ అయిందని నిర్ధారించారు.

ఈ ఘటనపై స్థానిక పోలిసులతో పాటు ఎఫ్.బీ.ఐ. కూడా రంగంలోకి దిగి ధర్యాప్తు చేసింది. వారం రోజుల పాటు వెతికినా చిన్నారి ఆచూకి లభించలేదు. శాన్వి కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ లో నివసించే తెలుగువాడైన యండమూరి రఘనందన్ వీరి కుటుంబానికి దగ్గరి స్నేహితుడు. పోలిసులకు ఇతనిపై అనుమానం వచ్చి విచారించగా.. ముందు బుకాయించాడు. ఆ తర్వాత తానే ఇద్దర్నీ హత్య చేసినట్లు అంగీకరించాడు. మళ్ళీ తర్వాత మాట మార్చాడు. తాను ఇంట్లో కేవలం డబ్బులు మాత్రమే దొంగతనం చేశానని చెప్పాడు. ఇద్దరు అమెరికా జాతీయులు తనను బెదిరించి వారిద్దరినీ హత్య చేశాడని ఆరోపించాడు.

ఈ ఘటనపై ధర్యాప్తు చేపట్టిన పోలిసులు 26 అక్టోబర్ 2013న ఓ సూట్ కేసులో శాన్వీ మృతదేహం గుర్తించారు. చనిపోయిన ఇద్దరినీ రఘునందన్ హత్య చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. అయితే తనకు ఏ సంబంధ: లేదు అని కోర్టులో కూడా రఘునందన్ బుకాయించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం శాన్వీ వెన్న, సత్యవతి వెన్నలను హత్య చేసింది రఘునందన్ అని ఈనెల 9న నిర్ధారించింది. కేసులో దోషిగా తేలిన రఘుకు మంగళవారం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saanvi  death  america  latest updates  

Other Articles