హైదరాబాద్లో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది. గురువారం ఉదయం ఆఫీసుకని ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లిన ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్న. పోలీసులు వైజాగ్లో అమెను అదుపులోకి తీసుకున్నారు. భవ్వశ్రీ ఆచూకీ కోసం రంగంలోకి దిగిన సైబరాబాద్ ప్రత్యేక బృందాలు అమె ఆచూకీని ఎట్టకేలకు సంపాదించాయి. పోలీసు ప్రత్యేక బృందాలు భవ్యశ్రీని హైదరాబాద్ తీసుకువచ్చి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కూకట్పల్లిలోని హౌజింగ్ బోర్డు ఏడవ షేజ్ లో నివాసం ఉంటున్న భవ్యశ్రీ ఈ నెల 9న అదృశ్యమైంది. రెండేళ్ల క్రితం కార్తీక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భవ్వశ్రీ హఠాత్తుగా అదృశ్యం కావడంపై పలు అనుమానాలు రేకెత్తాయి. గత గురువారం ఉదయం ఆమె క్యాబ్లో డ్యూటీకి బయలుదేరి వెళ్లిన అమె తిరిగి ఇంటికి తిరిగి రాకపోవడంతో..తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అమెను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాయి.
మీడియాలో భవ్వశ్రీ అదృశ్యంపై కథనాలు వెలువడడంతో ఎప్పటికప్పుడు సమాచారం అందుకున్న అమె.. తప్పించుకున్నారు. ముందుగా అమెను పాడేరు అతిధి గృహంలో వున్నట్లు పోలీసులు ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించారు. తీరా.. పోలీసులు చేరుకునే సమయానికి అక్కడి నుంచి జారుకున్నారు. చివరకు విశాఖలో ఉన్నట్లు తెలుసుకొని, అక్కడకు వెళ్లి ఆమెను హైదరాబాద్ కు తీసుకువచ్చారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భవ్యశ్రీ.. రిలీఫ్ కోసమే తాను విశాఖ వెళ్లినట్లు చెప్పారు. అయితే భర్తతో పాటు కుటుంభసభ్యులకు ఎవరికీ సమాచారం అందించకుండా ఎందుకు విశాఖకు వెళ్లిందనేది అమెకే తెలియాలి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more