Relief to puri as cyclone crosses coast at vishaka

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, odisha, puri

Relief to puri, as cyclone crosses coast at vishaka

ఊపిరి పీల్చుకున్న పూరి వాసులు..

Posted: 10/12/2014 07:13 PM IST
Relief to puri as cyclone crosses coast at vishaka

గత నాలుగు రోజులుగా కంటి మీద కునుకును కరువు చేసిన హుదుద్ తుపాను పూరి వాసులను భయందోళనకు గురిచేసింది. తుపాను విశాఖపట్నం వద్ద తీరం దాటడంతో పూరీకి ముప్పు తప్పింది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని భయాందోళనకు గురైన పూరీవాసులు కొంత ఉపశమనం పొందారు. శనివారం రాత్రి నుంచి పూరీతీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆదివారం ఉదయం నుంచి ఈదురుగాలులు వీయడం, వర్షాలు కురవడంతో ప్రజలు మరింత భయపడ్డారు. శనివారం రాత్రి పెంటకోట ప్రాంతంలో సముద్రం గ్రామం వైపు చొచ్చుకొచ్చింది.

దీంతో తీరంలో ఉన్న పడవలను అలలు లోపలకు లాగేశాయి. పడవలను కాపాడేందుకు వెళ్లిన ఎస్.సుందరయ్య(45) అనే వ్యక్తి అలల తాకిడికి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఆదివారం ఉదయం తుపాను తీరం దాటాక పూరీ సముద్రంలో అలల తీవ్రత తగ్గింది. సాయంత్రానికి వర్షాలు కూడా తగ్గాయి. దీంతో పూరీ ప్రజలు వూపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రాంతంలో ఉంటున్న మత్స్యకారులు తుని, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాలకు చెందినవారు కావడంతో వారి బంధువుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  odisha  puri  

Other Articles