Heavy rains continues in andhra orissa

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, odisha, Heavy Rains

heavy rains continues in Andhra, Orissa

హుదూద్ ప్రభావంతో ఆంధ్రా, ఒడిశాలలో భారీ వర్షాలు

Posted: 10/12/2014 06:38 PM IST
Heavy rains continues in andhra orissa

'హుదుద్' తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పెనుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. విశాఖలో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో నగరంలో అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. ద్విచక్రవాహనాలు కూడా కదల్లేని పరిస్థితి ఏర్పడింది. నగరంలో పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. నర్సీపట్నం మండలం పెద్దబోడిపల్లి వద్ద ట్రాన్స్‌ఫార్మర్ కూలి ఏటీఎం ధ్వంసమైంది. పెనుగాలులకు చోడవరం తహసీల్దార్ కార్యాలయ పైకప్పు కూలిపోయింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా గవరపాలెం వద్ద కూడా వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. వరద నీరు కారణంగా కొత్తవలస-సబ్బవరం రహదారిలో రాకపోకలు ఆగిపోయాయి.

అటు కటక్, భువనేశ్వర్‌లలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు కురవడంతో జనజీవనం స్తంభించింది. ప్రధాన మార్కెట్లు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైళ్లు రద్దు కావడంతో రైల్వేస్టేషన్లు కూడా జనశూన్యంగా నిలిచాయి. కటక్‌లో రోజు రెండు వేలకుపైగా బస్సులు రాకపోకలు సాగించేవని.. హుదూద్ నేపథ్యంలో కేవలం 5శాతం బస్సులే తిరుగుతున్నట్లు రాష్ట్ర ప్రైవేటు బస్సుల యజమాన్యాల సంఘం తెలిపింది. భారీ వర్షం వలన పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో నగరంలో 200 మోటర్ పంప్‌లు ఏర్పాటు చేస్తూ నీటిని నదిలోకి తరలిస్తున్నారు. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే నది ఒడ్డున ఉన్నవారిని షెల్టర్లకు తరలించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. రిలీఫ్ సామగ్రి కూడా అందుబాటులో ఉంచారు.

భువనేశ్వర్‌లో కూడా శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నానానికి వర్షాలు కాస్త తెరిపి ఇచ్చాయి. వర్షాలు వలన కొన్ని బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరుకుంది. తుపాను అనంతరం కురిసే వర్షాలను ఎదుర్కొనేందుకు అక్కడి స్థానిక అధికార యంత్రాంగం ముందుగా అప్రమత్తమైంది. ఇవాళ కూడా అధికారులు విధులకు హాజరై పరిస్థితి సమీక్షిస్తున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇవాళ కురిసిన వర్షాలు వలన సాలియాసాహి, గాదియాఖొలొ బస్తీల్లో నీరు చేరింది. అధికారులు అక్కడకు చేరుకుని డోజర్ల ద్వారా కాలువల నుంచి మట్టి తొలగించడంతో పరిస్థితి సర్దుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  odisha  Heavy Rains  

Other Articles