Hudhud impact on india westindies 3rd odi

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, india, west indies, odi match, cricket

Hudhud impact on india, westindies 3rd odi

ఇండియా, వెస్టిండీస్ మూడో వన్డేపై హుదూద్ ప్రభావం..

Posted: 10/12/2014 04:59 PM IST
Hudhud impact on india westindies 3rd odi

భారత్, వెస్టీండీస్ మధ్య జరగాల్సిన మూడొ వన్డే మ్యాచ్ పై హుదూద్ తుపాను ప్రభావం పడింది. భారత పర్యటనలో టీమిండియాతో ఐదు వన్డే మ్యాచ్ లు ఆడాల్సిన వుంది. కాగా స్వదేశంలో జరగుతున్న సీరీస్ లో విండీస్ చేతిలో తొలి మ్యాచ్ ఒడిన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. ప్రస్తుతం రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి.. సీరిస్ లో సమంగా వున్నాయి. కాగా, మంగళవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డేకు విశాఖ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్లు ఇవాళ విశాఖ చేరుకోవాల్సి ఉంది. హుదుద్ తుపాను కారణంగా రెండు జట్లు ఇంకా విశాఖ చేరుకోలేదని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు తెలిపారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే సోమవారం రెండు జట్లు విశాఖ చేరుకుంటాయని, ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను తీసుకొస్తామని ఆయన తెలిపారు. మైదానం తడవకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ ను వీక్షించేందుక 70శాతం టిక్కెట్లు అభిమానులకు విక్రయించామని తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై హుదూద్ తుపాను ప్రభావం తీవ్రంగా వుండడంతో భారత్, వెస్టీండీస్ క్రీడాకారులను ఇక్కడ వచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం టిక్కెట్లు విక్రయించామని అధికారులు చెబుతున్నా.. భారీ వర్షాల నేపథ్యంలో వర్షంలో తడుస్తూ మ్యాచ్ చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపరని పలువురు అంటున్నారు. మ్యాచ్ జరగకపోతే టిక్కెట్ల నగదును తిరిగి చెల్లిస్తామనిఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  india  west indies  odi match  cricket  

Other Articles