Congress mla jeevan reddy controversial comments on cm kcr

congress mla jeevan reddy, cm kcr, cm kcr latest news, power problems in telangana, telangana state, telangana news, kcr jeevan reddy news

congress mla jeevan reddy controversial comments on cm kcr about power problems

కేసీఆర్ వల్లే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడిందట!

Posted: 10/07/2014 08:24 PM IST
Congress mla jeevan reddy controversial comments on cm kcr

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. మొదటినుంచి ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే వస్తోంది. అందులో ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం! సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎన్నోసార్లు హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇంతవరకు ఒక్క హామీని కూడా ఆయన పూర్తి చేయడం లేదంటూ తెలంగాణ ప్రజలతోపాటు ప్రత్యర్థ పార్టీ నాయకులు ఆయన మీద విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడడానికి కేసీఆరే కారణమని.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తూ వస్తున్నారని తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు.

హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ మీద ఘాటుగానే విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో వున్న ఒక వ్యక్తి దుర్భాషలాడడం అతని సంస్కారానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే 7 గంటలవరకు తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని తప్పుడు హామీలు ప్రకటించి వారి ప్రాణాలను కేసీఆర్ బలితీసుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. విద్యుత్ సమస్యలతో ఇంతవరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల బాధ్యత కేసీఆర్ వహించాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన... వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించేలా సహాయకచర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచనలిచ్చారు. అలాగే సరిగ్గా భోజనం అందక ఎంతోమంది గిరిజనులు తమ ప్రాణాలను కోల్పోయారని.. అటువంటివారికి కాపాడకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తయిన 54% విద్యుత్ ను విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించారని గుర్తుచేసిన ఆయన... చట్టంలో పేర్కొన్న విద్యుత్ ను పొందలేకపోవడం కేసీఆర్ తెలంగాణకు చేస్తున్న ద్రోహమని అన్నారు. ఇచ్చిన మాటలను కేసీఆర్ నిలబెట్టుకోలేక అనవరసరంగా సమయాన్ని వృధా చేస్తున్నారని.. అలాగే ఇతర పథకాల పేర్లు చెబుతూ తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తూనే వున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడున్న విద్యుత్ సమస్య తీరాలంటే కేసీఆర్ వెంటనే తెలంగాణ ఎంపీలందర్నీ ఢిల్లీకి పంపి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress mla jeevan reddy  kcr  telangana state  power problems  telugu news  

Other Articles