Finally police revealed the mystery of family murder case of kadapa

kadapa family murder case, kadapa district sp naveen, krupakar family murder case, shanti association president rajaratnam, kadapa district police

finally police revealed the mystery of family murder case of kadapa

ఏడాదిక్రితం జరిగిన కుటుంబహత్యకేసు మిస్టరీ వీడింది!

Posted: 10/07/2014 08:51 PM IST
Finally police revealed the mystery of family murder case of kadapa

కడప పట్టణంలో ఏడాదిక్రితం అదృశ్యమైన ఐదుగురు కుటుంబసభ్యలు శవాలుగా మారి తేలిన విషయం ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే! చివరకు ఈ కేసు వెనకున్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. శాంతిసంఘం జిల్లా అధ్యక్షడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్ కుమారుడు కృపాకర్ ఏడాదిక్రితం భార్య మౌనికతోపాటు తన ముగ్గురు పిల్లలతో కలిసి కనిపించకుండా పోవడంతో... మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లు కంప్లయింట్ అయితే తీసుకున్నారు కానీ.. కేసు మాత్రం నమోదు చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో ఈ కేసు అలా, ఇలా సాగుతూ ఒక సంవత్సరం వరకు కొనసాగింది.

దీంతో ఆమె జిల్లా ఎస్సీని ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కృపాకర్ సన్నిహితులు, ఇతరులను విచారించిన అనంతరం వారందరూ హత్యకు గురైనట్లు తేల్చిన ఆ ప్రత్యేక బృందాలు.. హత్యకు గురైన కృపాకర్ నిర్వహిస్తున్న స్కూల్ గ్రౌండ్ లోనే వారు శవాలు వున్నట్లు తేల్చారు. వీరందరూ హత్యకు గురయ్యారనే విచారణలో తేలింది కానీ.. ఎందుకు హత్య చేయబడ్డారోనన్న విషయం మిస్టరీగానే మిలిగింది. దీంతో తమ విచారణను మరింత వేగవంతం చేసిన పోలీసులు.. చివరకు ఈ మత్య వెనుక వున్న మిస్టరీని ఛేదించగలిగారు.

కృపాకర్ తన భార్య మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతోనే హత్యకు పథకం వేసినట్లు జిల్లా ఎస్పీ నవీన్ చెప్పారు. భర్త కృపాకరే తన భార్య మౌనికతోపాటు ముగ్గురు పిల్లలను హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ హత్య చేయించిన అనంతరం కృపాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న బాధతో కుంగిపోయిన కృపాకర్.. అవమానాన్ని భరించలేక తమ పిల్లలతోపాటు భార్యను కూడా చంపించేశాడని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామంజనేయరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయాలన్నీ కృపాకర్ తండ్రి రాజారత్నానికి ముందే తెలిసినప్పటికీ బయటపెట్టలేదని, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kadapa family murder case  kadapa district police  murder mystery case  

Other Articles