Jayalalitha not got bail

aidmk, ram jethmalani, aidmk party, jayalalitha, jayalalitha case, jayalalitha latest, jayalalitha news, jayalalitha arrest, jayalalitha release, jayalalitha news, jayalalitha got bail, criminal cases latest news, karnataka high court, ram jethmalani, ram jethmalani cases, ram jethmalani contraversy, ram jethmalani news

aidmk chief jayalalitha not got bail in karnataka highcourt on tuesday : karnataka highcourt shocked jayalalitha and rejected bail her bail pitition

అమ్మను కోర్టు కరుణించలేదు... షాక్ తో జైలులో కుప్పకూలిన జయ

Posted: 10/07/2014 05:16 PM IST
Jayalalitha not got bail

అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు చివరకు ఆశాభంగమే మిగిలింది. జయలలిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. మంగళవారం బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ చంద్రశేఖర్ తో కూడిన ధర్మాసనం.., పిటిషన్ ను తిరస్కరించింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన వాదనల తర్వాత వెలువడ్డ తీర్పు అన్నాడీఎంకే అభిమానులకు నిరాశను మిగిల్చింది. బెయిల్ వస్తుందని భావించిన జయలలిత, న్యాయవాది రాం జెఠ్మలానీ, జయ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు తన బెయిల్ పిటిషన్ పై తీర్పును జైలులో ఉన్న టీవీ ద్వారా తెలుసుకున్న జయలలిత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వైద్యలు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

జయ కోసం జెఠ్మలానీ వాదన

జయలలిత బెయిల్ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించారు. జయలలితకు బెయిల్ ఇవ్వాలని వాదనలు విన్పించారు. జయలలిత చట్టం, న్యాయాన్ని గౌరవించే వ్యక్తి అని చెప్పారు. విదేశాలకు పారిపోదు అని హామి ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలన్నారు. కేసులో తదుపరి విచారణ ఉంటే పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత వాదనలు విన్పించిన ప్రాసిక్యూషన్ న్యాయవాది షరతులతో కూడిన బెయిల్ ఇస్తే తమకు అభ్యంతరం లేదు అని కోర్టుకు తెలిపారు. కేసు విచారణకు సహకరించేలా బెయిల్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని వివరణ ఇచ్చారు.

స్వీట్లు తినేలోపు షాక్

జెఠ్మలానీ వాదనలపై ఉన్న నమ్మకంతో పాటు ప్రాసిక్యూషన్ కూడా జయకు బెయిల్ ఇస్తే అభ్యంతరం లేదు అని ప్రకటించటంతో ఇక ‘‘అమ్మకు విడుదల’’ అంటూ అన్నాడీఎంకే అనుచరులు, అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. తీర్పు నేపథ్యంలో భారీగా కర్ణాటకకు వచ్చిన జయ అభిమానులు కొద్దిసేపు సంతోషంలో మునిగితేలారు. అంతలోనే వెలువడ్డ కోర్టు తీర్పు వారికి షాకిచ్చింది. స్వీట్లు తినేలోపు చేదువార్త వారి చెవిన పడింది. అదేమంటే జయలలితకు బెయిల్ రాలేదని. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జయలలితకు బెయిల్ ఇవ్వటం లేదు అని తీర్పుఇచ్చారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్బంగా ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

అవినీతి కేసుల్లో కఠినంగా వ్యవహరించటంతో పాటు.., నేరస్తులకు బెయిల్ ఇవ్వకూడదు అన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ జయలలితకు బెయిల్ ఇవ్వటం లేదు అని ధర్మాసనం ప్రకటించింది. అవినీతి చేసినవారికి సులువుగా బెయిల్ ఇస్తే.., వారిని ప్రోత్సహించినట్లవుతుంది అని గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెయిల్ ఇవ్వటం లేదన్న హైకోర్టు తీర్పుతో జయ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. 66కోట్లకు సంబంధించిన అక్రమాస్తుల కేసులో గత నెల 27న జయలలిత అరెస్టయ్యారు. జయతో పాటు సన్నిహితురాలు శశికళ, దత్తపుత్రుడు సుధాకరన్ కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్షతో పాటు రూ. 100కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

సీనియర్ న్యాయవాదిగా పేరు పొందిన రాం జెఠ్మలానీ జయకు తన వాదనలతో బెయిల్ రావటం ఖాయంగా చెప్పారు. అంతేకాదు ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు తనకు ఐదు నిమిషాలు చాలు అని గొప్పలు పలికారు. కోర్టులో కూడా అంతే సమర్ధంగా వాదించారు. అటు ప్రాసిక్యూషన్ కూడా కాస్త మెత్తబడినట్లుగా మీరిస్తామంటే మేము వద్దంటామా అన్నట్లుగా వాదించింది. దీంతో జెఠ్మలాని మాయ పనిచేసింది అని అంతా అనుకున్నారు. కాని తీర్పును చదివి విన్పించగానే.., సీనియర్ న్యాయవాది షాకయ్యారు. ఇదేమిటి ఇలా జరిగింది అనుకున్నారు.

కన్నడిగుల పరిస్థితి ఏమిటి..?

జయలలితకు కర్ణాటక కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంపై తమిళనాడు ప్రజలు ముఖ్యంగా అన్నాడిఎంకే శ్రేణులు, జయ అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేసుపై తీర్పు సందర్బంగా గతంలో కోర్టు వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అప్పట్లో వారిని కట్టడి చేయటం పోలిసులకు కష్టతరమైంది. అటు నిత్యం ఏదో ఒక రూపంలో జైలు దగ్గర అభిమానులు నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఇవాళ బెయిల్ పిటిషన్ సందర్బంగా కూడా వేల సంఖ్యలో తమిళులు కర్ణాటకకు వచ్చారు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక పోలిసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదంతా ఒకలా ఉంటే.., తమిళనాడులోని కన్నడిగుల పరిస్థితి గందరగోళంగా ఉంది. జయలలితకు ఇవాళ బెయిల్ రాకపోతే తమిళనాడులో ఉండే కన్నడిగుల అంతు చూస్తామని ఆమె అభిమానులు పోస్టర్లను అంటించి మరీ హెచ్చరికలు జారీచేశారు. కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వకుంటే కన్నడిగుల అంతు చూస్తామని హెచ్చరించారు. ఇప్పుడు బెయిల్ రాకపోవటంతో వారి నుంచి ఎలాంటి ముప్పు ఎదురవుతుందో అని తమిళనాడులో ఉన్న కన్నడిగులు వణికిపోతున్నారు. సెంటిమెంట్, ఆత్మగౌరవంకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తమిళ ప్రజలు అమ్మగా భావించే జయలలితకు బెయిల్ రాకపోవటంతో ఆగ్రహంతో ఏం చేస్తారో అని అందర్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalaitha  ram jethmalani  bail  karnataka high court  

Other Articles