Ram gopal varma s endless confussions

Ram Gopal Varma, twitter, narendra modi, jayalalithaa, sarees, gandhiji, rahul, sonia

gandhiji having almost no clothes and jayalalitha having 10000 sarees twits ramgopalvarma

రామ..రామ.. ఏమిటిది గోపాల వర్మా..!

Posted: 10/02/2014 01:05 PM IST
Ram gopal varma s endless confussions

వెర్రి వెయి రకాలని అంటుంటారు పెద్దలు.. అది నానుడా..? లేక నిజమేనా అన్న ధర్మ సందేహం ఎప్పుడైనా కలిగిందో లేదో కానీ. దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ పుర్రెలో పుట్టే సందేహాలకు అది అంతూ ఉండడం లేదండి. నిజమేనండి.. నిత్యం ఏదో ఒక సంచలన వార్తల్లో ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. తాజాగా 145వ గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్ముడికి దేశ ప్రజలు ఘనంగా నివాళులు గటిస్తున్న తరుణంలో రాంగోపాల్ వర్మ.. తన మనసులో ఉన్న అనుమానాలను మరోసారి ట్విట్టర్లో పెట్టారు.

జాతిపిత పూజ్య బాపూజీకి రాజకీయాలను అంటగట్టే ప్రయత్నం చేశాడు. గాంధీజీ బతికి ఉంటే ఎవరిని సపోర్ట్ చేసేవారు. అలా అయితే నరేంద్ర మోడీ గెలిచేవాడా అంటూ తన సంచలన సందేహాలు భయటపెట్టాడు. గాంధీజీ ఏమో తక్కువ బట్టలు ధరిస్తే...జయలలితకేమో పదివేల చీరలా అంటూ ఆయన ట్విట్టర్ లో నిలదీశాడు. ఒకవేళ గాంధీజీ గనుక బతికుంటే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ తరపున ప్రచారం చేసేవారు. కాంగ్రెస్ తరపునా లేక బీజేపీ తరపున? గాంధీజీ కనుక సోనియా గాంధీ, లేదా రాహుల్ కు మద్దతుగా ప్రచారం చేసివుంటే నరేంద్ర మోడీ గెలిచేవారా? అని తన సందేహాలను ట్విట్ చేశాడు. అంతేకాదండోయ్..

గాంధీజీ ఆశయాలను పదిమంది నాయకులు అయినా అనుసరించి ఉంటే దేశం అభివృద్ధిలో ఎక్కడో ఉండేదని రాజకీయ నేతలకు కూడా చురకలంటించారు. వర్మకు వచ్చిన మరో ముఖ్యమైన సందేహం ఏంటంటే.. గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాడా? దేశం గాంధీజీకి స్వాతంత్ర్యం ఇచ్చిందా? అని దీనికి సమాధానం ఎవరు చెప్పాలి. .దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన బాపూజీపై తన అమితమైన ప్రేమను కనబరుస్తూ.. ప్రస్తుత రాజకీయ నేతలతో గాంధీని సరిపొల్చుతూ.. విభిన్నమైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించి.. వాటిని తనకున్న సందేహాలుగా చెప్పుకోవడం వర్మకే చెల్లింది మరి. ఇదంతా చూసిన రామ్ గోపాల్ వర్మ అభిమానులు మాత్రం రామ.. రామ .. ఇదేమిటి గోపాల వర్మా.. అనుకుంటు గొనుగుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  twitter  narendra modi  jayalalithaa  sarees  gandhiji  rahul  sonia  

Other Articles