Toddy shops are ready to open

Toddy shops, toddy licences, new toddy policy, telangana government, 104 shops, g.o number 24

toddy shops are ready to open from tommarrow in hyderabad

దసరా వచ్చింది. కల్లును తెచ్చింది..

Posted: 10/02/2014 04:21 PM IST
Toddy shops are ready to open

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దసరా పండగ కొత్తదనాన్ని సంతరించుకనుంది. అయితే ఇది అందరికీ కాదండోయ్ కేవలం మందుబాబులకు మాత్రమే. తెలంగాణ సంస్కృతిలో భాగంగా దసరా శరన్నవరాత్రులు నిష్టతో జరిపుకునే భక్తులు అ తరువాతి రోజున అలాయ్ భలాయ్ లను నిర్వహించుకుని తమ స్నేహితులతో మందు, విందులు చేసుకుంటారు. పండగ తరువాతి రోజున మాంసం తినడం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే హైదరాబాద్ వాసులకు మాత్రం ఈ పండగ కొత్త దనాన్ని నింపుకుని కల్లు దుకాణాలను తీసకువస్తోంది.

నూతన కల్లు పాలసీతో అక్టోబర్‌ 1నుంచే నూతన కల్లు విధానం ఆరంభమైనప్పటికీ అధికారికంగా అక్టోబర్‌ 3నుంచి అంటే సరిగ్గా పండగ రోజు నుంచి నూతన దుకాణాలు తెరచుకోనున్నాయి. ఈ దఫా జంటనగరాల్లో అనుమతించనున్న కల్లు దాకాణాలు బార్‌ దుకాణాల తరహాలో దర్శనమివ్వనున్నాయి. కల్లు కాంపౌండ్‌ అంటేనే కనిపించే వాతావరణాన్ని సమూలంగా మార్చి అధునాతన రీతిలో కల్లు దుకాణాలను మోడ్రనైజ్‌ చేయాలని పాలసీలో విధావిధానాలను ఖరారు చేశారు. దీని ప్రకారం ప్రతి కల్లు దుకాణం విధిగా కల్లు కాంపౌండ్‌ ఆవరణ బైటకు కన్పించకుండా పూర్తిగా కాంపౌండ్‌ వాల్‌ను ఏర్పాటు చేసుకోవాలి. విధిగా సెక్యూరిటీ గార్డును నియమించి ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్తివాసులకు ఇబ్బందిలేని రీతిలో వ్యాపారం జరుపుకోవాలి.

కల్లు దుకాణాల కోసం ఇప్పటికే లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రారంభం కావడంతో కొత్తగా జంటనగరాల్లో స్థలాన్వేషణ జరుగుతోంది. హైదరాబాద్‌లో 42 సొసైటీల ద్వారా 103 కల్లు దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు.  2004-05లో 50 కిలోమీటర్ల దూరంలో తాటిచెట్లు ఉండాలనే నిబంధన కారణంగా జంటనగరాల్లో మూతపడిన 104 దుకాణాలను తాజాగా దసరానుంచి పారంభం కానున్నాయి. దీంతో సుదూర ప్రాంతాలనుంచి కల్లును తెచ్చకునేందుకు జీఓ నంబర్‌ 24ను సవరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేల టీఎఫ్టీలు, టీఎస్‌టీలు కల్లు దుకాణాలను తెరవనున్నాయి. వీటిద్వారా ఖజానాకు ఏటా రూ. 2నుంచి రూ. 5కోట్ల మేర ఆదాయం రానుంది.

2004-05లో కల్లు దుకాణాలు మూతపడిన అనంతరం సొసైటీల్లో సభుల సంఖ్య యధాతథంగానే వుంది. ఈ నేపథ్యంలో అలా వీలు కాని సొసైటీలకు పర్సన్‌ ఇన్‌చార్జిల పేరుతో 6 మాసాలకే లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా సభ్యత్వాలు... అయితే రాష్ట్రంలోని అన్ని సొసైటీల్లో నూతన సభ్యత్వాలకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆబ్కారీ శాఖనుంచి వివరాలను సేకరించిన అనంతరం రాష్ట్రమంతటా ఒకేసారి సభ్యత్వ నమోదును చేపట్టాలని భావిస్తున్నారు. అయితే ఈ ధఫా సభ్యుల చేరికల్లో అనేక కఠిన నిబంధనలు అమలులోకి తేనున్నారు. ఇందులో ప్రధానంగా ట్యాడీ టాపింగ్‌ టెస్టును పెట్టి వీడియో తీయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అర్హత కలిగిన ఏ ఒక్క సభ్యుడికీ అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇందులో ప్రతి సొసైటీలో వీటి పరిశీలనకు త్రీ మెన్‌ కమిటీని అధికారికంగా నియమించ నున్నారు. అక్రమాలు, అన్యాయాలపై ఈ కమిటీ పరిశీలన జరుపనున్నట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Toddy shops  toddy licences  new toddy policy  telangana government  104 shops  g.o number 24  

Other Articles