Pm narendra modi launches swachh bharat

narendra modi, Swachh Bharat, Valmiki Basti, clean, Gandhi Jayanti, Clean India mission BJP, PM

PM launches ‘Swachh Bharat’ mission, says India can do it

మహాత్ముడు కలలు గన్న భారతవని నిర్మాద్దాం..

Posted: 10/02/2014 12:18 PM IST
Pm narendra modi launches swachh bharat

పూజ్య బాపూపీ, మహాత్మాగాంధీ కలలు గన్న భారతావనిన నిర్మిద్దామని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని వాల్మీకి బస్తీ, ఇండియాగేట్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  'స్వచ్ఛ భారత్' 125 కోట్ల మంది ప్రజల కార్యక్రమమని చెప్పారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రం సాధించుకున్నాం... కానీ మహాత్ముడి స్వచ్ఛభారత్ కల మాత్రం ఇవాళ్టికి సాకారం కాలేదన్నారు. క్విట్ ఇండియా, క్లీన్ ఇండియా అని మహాత్ముడు సందేశమిచ్చారని మోడీ గుర్తు చేశారు. పారిశుద్ధ్యంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్ ఇది సాధిస్తుందని.. దేశ ప్రజలు సాధించగలరని మోడీ ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మై క్లీన్ ఇండియా ప్రచారం ప్రారంభించారు.

శాస్త్రవేత్తల కృషి వల్లే మనం అంగారక గ్రహాన్ని చేరుకున్నామన్నారు. స్వచ్ఛభారత్ రాజకీయ కార్యక్రమం కాదని.. దేశంపై ప్రేమతో చేపట్టిన కార్యక్రమని వెల్లడించారు. సోషల్‌మీడియా ద్వారా స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి మరిత ప్రచారం పెంచాలని కోరారు. చెత్తను తొలగించే కార్యక్రమాన్ని సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయాలని సూచించారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మోడీ స్వయంగా చీపురు పట్టారు.  ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తారు.

కార్యక్రమానికి హాజరైన ప్రతిఒక్కరితో మోదీ స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇండియాగేట్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో సుమారు అయిదు వేలమంది విద్యార్థులతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్నారు.  అంతకు ముందు మోడీ వాల్మీకి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  Swachh Bharat  Valmiki Basti  clean  Gandhi Jayanti  Clean India mission BJP  PM  

Other Articles