Andhrapradesh chief minister chandrababu impliments new idea to control law and order

Andhrapradesh, Chief minister, Chandrababu, new idea, law and order, YCP, jagan mohan reddy

Andhrapradesh Chief minister Chandrababu impliments new idea to control law and order

నేరాల అదుపుకు సీఎం చంద్రబాబు నయా ప్లాన్..

Posted: 09/30/2014 10:18 AM IST
Andhrapradesh chief minister chandrababu impliments new idea to control law and order

ఆంధ్రప్రదేశ్‌.. ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తరుణంలో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తాను వేసే ప్రతీ అడుగును ఆచితూచి వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వున్నంత వరకు చరిత్రలో తన పేరు నిలిచపోయేలా ప్రతీ పనిలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పుడు తనతో కానీ, తన మంత్రి మండలితో కానీ.. ఎలాంటి పోరబాటు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను సన్నగిల్లాయని రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణం, చర్చలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధి నేతగా చంద్రబాబు వాటిపై దృష్టి సారించారు. మూడు నెల్లలోనే 19 మంది వైసీపీ నేతల హత్య జరిగినట్లు వచ్చిన ఆరోపణలను అసెంబ్లీ సందర్భంగా అయితే ధీటుగానే ఎదుర్కొన్నా.. శాంతిభద్రలపై దృష్టి సారించాల్సిన అవసరం వుందని ఆయన యోచించారు. అందుకే.. ఇకపై రాష్ట్రంలో ఏ నేరం జరిగినా.. తనకు తక్షణం తెలిసేలా చర్యలు తీసుకున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన ముఖ్యమంత్రి.. నేరాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు గమనించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా పోలీసుశాఖ కంప్యూటర్ విభాగాన్ని ముఖ్యమంత్రి కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల పోలీసుస్టేషన్లలో నమోదయ్యే కేసులు మొదలు పోలీసుశాఖలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గమనించడానికి వీలవుతుంది. ఇప్పటివరకు అధికారులు మాత్రమే పోలీసుశాఖలో జరుగుతున్న దైనందిన వ్యవహారాలను పరిశీలించడానికి అవకాశం ఉంది. ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీటిని గమనించేందుకు వీలు చిక్కుతుంది. దీంతో ఎప్పటికప్పడు నేరాల అదుపు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థతిని చంద్రబాబు పరిశీలించనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhrapradesh  Chief minister  Chandrababu  new idea  law and order  

Other Articles