Beware of new rowntree search engine

pornography, search engine, rowntree

new search engine for porn sites

ఇంట్లో ఇంటర్ నెట్ వుంటే జాగ్రత్త సుమండీ...

Posted: 09/30/2014 11:18 AM IST
Beware of new rowntree search engine

పెద్దలు తస్మాత్ జాగ్రత్త.. ఇక మీరు లేకుండానే మీ పిల్లలు కంప్యూటర్ లో గేమ్స్ అడుతున్నారా..? మీరు లేకుండానే ఇంటర్ నెట్ ను బ్రౌజ్ చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త పడాల్సిన సమయం అసన్నమైంది. ఇక పై మీరు లేనప్పుడు నెట్ ను లాక్ చేయడమో.. లేక పాస్ వర్డ్ పెట్టడమో చేయాల్సిందే. ఎందుకంటారా..? ఇప్పడు కొత్త సర్చ్ ఇంజన్ వచ్చింది. అంతర్జాల ప్రపంచంలో రోజుకో కొత్త సెర్చింజన్ రావడం కొత్తేమీ కాదు. కానీ.. ఏకంగా బూతు సైట్ల కోసం కూడా ప్రత్యేకంగా ఓ సెర్చింజన్ వచ్చిందంటే నమ్ముతారా?

గూగుల్ మాజీ ఉద్యోగులు డెవలప్ చేసిన ఓ టూల్ అచ్చంగా పోర్నోగ్రఫీ కోసమేనట. తమ సెర్చింజన్ రాకెట్లా దూసుకొచ్చిందని, ఇక త్వరలోనే అది విశ్వవ్యాప్తం అవుతుందని దాని వ్యవస్థాపకులలో ఒకరైన కోలిన్ రౌన్ట్రీ చెప్పారు. ప్రస్తుతం అడల్ట్ కంటెంట్ను గూగుల్, బింగ్ క్రమంగా తమ సెర్చింజన్ల నుంచి తీసేస్తున్నాయని, అందుకే ఇప్పుడు కొత్తగా దానికోసం ఒక సెర్చింజన్ ఉండాల్సిన అవసరం కనిపించిందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పోర్నోగ్రఫీ కోసం నెట్ జనులు సర్చ్ చేస్తున్నారని, అయితే వారు వెతికిన సైట్ లు కనబడక నిరాశకు గురవుతున్నారని కొత్త సర్చ్ ఇంజన్ వ్యవస్థాపకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఫోర్న్ సైట్స్ కు ఆదరణ వుందని, అందకనే తాము కొత్త సర్చ్ ఇంజన్ తో ముందుకు వచ్చామని చెప్పారు.

గూగుల్లో ఎవరైనా వీటికోసం వెతికితే కనపడకపోగా.. హెచ్చరికలు ఉంటాయని, అలాంటివాళ్లు వెంటనే తమ సెర్చింజన్ చూస్తే సరిపోతుందని రౌన్ట్రీ అంటున్నారు. ఇదే సమయంలో యూజర్ల వ్యక్తిగత రహస్యాలను కూడా కాపాడేలా తమ ఇంజన్ ఉంటుందని చెప్పారు. కుకీస్ గానీ, ఇతర యూజర్ ట్రాకింగ్ టెక్నాలజీలను గానీ తాము ఉపయోగించట్లేదని అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pornography  search engine  rowntree  

Other Articles