Four more mla s to join tdp

Telangana TDP, Talasani srinivas Yadav, Teegala Krishna Reddy, Prakash goud, ManchiReddy Kishan Reddy, TRS

four more MLA's to join TDP

షి‘కారు’కు.. ఆ.. నలుగురు...రెడీ?

Posted: 09/30/2014 09:34 AM IST
Four more mla s to join tdp

కారులో షికారు చేయడానికి మరో నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిద్దమయ్యారా..? ఈ వార్త టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు దేశం పార్టీలో సీనియర్ నాయకులుగా వున్న ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో ఎమ్మెల్యే కారెక్కడానికి రెడీ అయ్యరు. పార్టీ వ్యవహారల నుంచి గత కొంత కాలంగా దూరంగా వుంటున్న నేతలు కారు ప్రయాణినికి ఎందుకు సిద్దమయ్యారు. తెలంగాణ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన నేతలు. ఒక్కసారిగా పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు..?

వీరి ఆగమనంలో టీఆర్ఎస్ పార్టీ బలపడుతుంటే.. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లినట్లేనా..? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడిదే ప్రశ్న తెలంగాణ టీడీపీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఇంతకీ కారులో షికారుకు వెళ్తున్న వారెవరో తెలుసుకోవాలని వుందా..? ఎలాంటి లాభం లేకుండానే వారు పార్టీ ఫిరాయింపులకు ఎందుకు పాల్పడుతున్నట్లు..? టీడీపీ నేతలకు గాలం వేస్తున్న కేసీఆర్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ సక్సెస్ అవుతుందా..?

కారులో షికారు చేయడానికి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పరకాల టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిలు కూడా కారులో షికారుకు సిద్దమయ్యారని వచ్చిన వార్తలను స్వయంగా ఎర్రబెల్లి దయాకర్ రావే కోట్టిపారేశారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ పథకం స్థబ్దుగా వుందని భావిస్తున్న నేపథ్యంలో మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కారులో షికారుకు రెడ్డీ అవుతున్నారు.

 త్వరలో రానున్న గ్రేటర్ బల్దియా ఎన్నికల నేపథ్యంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఇటీవల జరిగిన బోనాల పండుగ నేపథ్యంలో బోనాలకు కేసీఆర్ ను ఆహ్వనించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .అప్పటి నుంచి  టీడీపీతో సంబంధాలను తెంచుకుని టీఆర్ఎస్ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన కారెక్కడానికి రెడీ అయినా.. ఇంకా సుముహూర్తం రాలేదు. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఆయనను పార్టీలోకి ఆహ్వనించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ కావడం ఈ వార్తలకు ఆస్కారమిస్తున్నాయి. తలసానికి కూడా మంత్రి పదవీ ఖాయమైందన్న వార్తలు వినబడుతున్నాయి. కాగా హైదరాబాద్ మహానగర ఎన్నికల సంగ్రామంలో ఆయన పనితీరు ఆధారంగానే తలసానికి మంత్రి పదవి దక్కుతుందన్న టాక్ కూడా వుంది. దీంతో హైదరాబాద్ లో కూడా టీఆర్ఎస్ బలంగా వుందన్న సంకేతాలతో.. ప్రజల్లోకి వెళ్లి బల్దియా పీఠాన్ని అధిరోహించాలని టీఆర్ఎస్ ప్రణాళికలను రచిస్తోంది.

బల్దియా మేయర్ గా చేసిన అనుభవజ్ఞుడైన మరో టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి కూడా కారులో షికారుకు రెడీ అయ్యారట. జంట నగరాలకు పరిమితమైన బల్దియాకు మేయర్ గా సేవలందించిన తీగల కృష్ణారెడ్డికి.. గ్రేటర్ బల్దియాకు మేయర్ గా చేస్తామన్న హామీ టీఆర్ఎస్ వర్గాల నుంచి లభించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా వున్న తీగల.. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అన్నీ వున్నా అణిగిమణిగి వుండే ఈ నేత మంత్రి హరీష్ రావుతో పాటు ఇటీవలే టీఆర్ఎస్ లోకి చేరిన తుమ్మల నాగేశ్వర రావుతో కూడా టచ్ లో వున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో కూడా పార్టీ బలోపేతం కోసం ఆకర్ష్ పథకాన్ని సిద్దంగా వుంచిన టీఆర్ఎస్.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతారని వార్తలు గుప్పుమంటున్నాయి. బహుశా అన్ని కుదిరితే దసరా నుంచి దీపావళి లోపు ఈ ఆపరేషన్ ను పూర్తిస్థాయిలో అమలు చేసేందకు టీఆర్ఎస్ సిద్దమవుతుందని సమాచారం. ఈ నలుగురు పార్టీలోకి చేరిన తరువాత.. నగరం నుంచి మరో ఒకరిద్దరు టీడీపీ నేతలకు కూడా టీఆర్ఎస్ ఇప్పటికే గాలం టీఆర్ఎస్ గాలం వేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఖమ్మం జిల్లాలో బలమైన నేతను పోగొట్టుకున్న టీడీపీ.. మరి కొందరు సీనియర్ నేతలను కోల్పోయిన పక్షంలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసే నాయకత్వం వుండదు. పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు కూడా పార్టీని వీడేందుకు వెనుకాడరు. ఈ పరిణామాలు తెలంగాణలో పార్టీ ఉనికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవిలా వున్నాయి. దీనిపై పార్టీ పునరాలోచన చేసి తమ కార్యకర్తలను, నేతలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని టీడీపీ అభిమానులు
అధినేత చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles