Clashes between 2 different category people in gujarath state

gujarath clashes, narendra modi state, gujarath state news, clashes in gujarath, clashes between 2 category people, narendra modi gujarath state news, godra clashes, internet problems gujarath

clashes between 2 different category people in gujarath state

గుజరాత్ లో మళ్లీ మొదలైన అల్లర్లు!

Posted: 09/29/2014 07:28 PM IST
Clashes between 2 different category people in gujarath state

ఎప్పుడో 2002వ సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ఆ రాష్ట్రంలో హిందూ-ముస్లిం వర్గాల మధ్య జరిగిన గోద్రా అల్లర్ల గురించి అందరికీ తెలిసిందే! ఆ అల్లర్లు చేయించింది మోడీయేనంటూ ఆ రాష్ట్రంలో వున్న ముస్లిములతోపాటు ఇతర పార్టీలు కూడా ఆరోపణలు చేశారు. అయితే ఆ తరవాత ఆ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కోర్టు.. ఆ అల్లర్లకు, మోడీకి ఎటువంటి సంబంధం లేదంటూ తేల్చి పారేసింది. అయనప్పటికీ మోడీ మతతత్వ నాయకుడంటూ అప్పటినుంచి ముద్రపడిపోయింది. అది వేరే విషయంలేండి! ఇప్పుడు తాజాగా మరోసారి మోడీ ప్రధానమంత్రి అయిన కొన్నిరోజుల తర్వాతే ఆ రాష్ట్రంలో అల్లర్లు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.

గుజరాత్ లోని వడోదరలో అనుకోకుండా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సోషల్ మీడియాలో ఒక వర్గంవారు మరో వర్గంవారి మనోభావాలను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడంతో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నాలుగురోజులపాటు మొబైల్ ఫోన్ ఇంటర్నెట్, మొబైల్ మెసేజ్ సర్వీసులను నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగ్రమంతో రెచ్చిపోయిన ఆ రెండువర్గాలు ఒకరిమీద మరొకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులపై కూడా మరికొందరైతే పైత్యం పెచ్చుమీరి వారిమీద దాడికి పాల్పడ్డారు. కొందరు ఏకంగా పోలీసుల వాహనాలనే నిప్పు పెట్టేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి భాష్పవాయువును ప్రయోగించారు. ఈ అల్లర్లలో పోలీసులు దాదాపు 200 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం ఉదయానికి వడోదరలో ప్రశాంత వాతావరణమే నెలకొందని అధికారులు వెల్లడించారు.

అనుకోకుండా ఇలా రెండువర్గాల మధ్య ఘర్షణ జరగడంపై కొంతమంది రాజకీయ విశ్లేషకులతోపాటు ప్రత్యర్థ నాయకులు రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొన్నిరోజులకే గుజరాత్ లో అల్లర్లు జరగడం.. ఇప్పుడు కూడా ప్రధాని అయిన కొన్నిరోజులకే ఇలా రెండువర్గాలు దాడి చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయని పేర్కొంటున్నారు. అలాగే మోడీ అమెరికా పర్యటనలో వుండగా.. ఆయన సొంత రాష్ట్రంలోనే ఘర్షణలు చోటు చేసుకోవడం విశేషంగా మారింది. మరి దీనిపై మోడీ ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles