Pak news papers on narendra modi

narendra modi, narendra modi wiki, narendra modi latest, narendra modi photo, narendra modi marriage, narendra modi on pakisthan, narendra modi america tour, narendra modi speech, narendra modi uno speech, narendra modi madison square speech, madison square, pakisthan, nawaz sharif, sharif speech, sharif comments on india, latest news, pakisthan media, pakisthan news papers, indian media

pak news papers praise narendra modi and at the same time downfalls pak prime minister nawaz sharif speech : pak media praised indian prime minister speech in uno meeting and criticises pak pm sharif

షరీఫ్ కంటే మోడి ప్రసంగం బాగుంది : పాక్ పత్రికలు

Posted: 09/29/2014 04:46 PM IST
Pak news papers on narendra modi

ప్రధాని నరేంద్రమోడిని పాక్ పత్రికలు ప్రశంసలతో ముంచెత్తాయి. నరేంద్రుడి ప్రసంగం చూసి దాయాది దేశ జర్నలిస్టులు మంత్రముగ్దులు అయ్యారు. అమెరికా సాక్షిగా మోడి చేసిన ప్రసంగం విన్న వారు ‘‘వాహ్ వారెవ్వా మోడి’’ అనుకుంటున్నారు. తమ దేశ ప్రధానికి.., భారత ప్రధానికి ఎంత తేడా ఉందో వివరించారు. మోడీ ప్రసంగాన్ని మెచ్చుకుంటూ పాక్ పత్రికలు ప్రత్యేక కధనాలు.., సంపాదకీయాలను ప్రచురించాయి. భారత ప్రధాని ప్రసంగం ముందు నవాజ్ షరీఫ్ ప్రసంగం వెలవెలబోయిందని విమర్శించాయి.

పాక్ ప్రముఖ పత్రిక ‘డైలి టైమ్స్’ మోడి ప్రసంగంను పొగుడుతూ ప్రత్యేక సంపాదకీయ కథనం ప్రచురించింది. ఐక్యరాజ్యసమితిలో మోడి ప్రసంగించిన తీరు అందరిని ఆకర్షించిందని పేర్కొంది. తాజా ప్రసంగంతో పాశ్చాత్య దేశాల్లో తన హవాను మరింత పెంచుకున్నారని ప్రచురించింది. ఇదే సమయంలో షరీఫ్ విదేశాలను ఆకట్టుకోవటంలో విఫలం అయ్యారని విమర్శించింది. పురాణాలు, ఇతిహాసాలు, దేశ ప్రాముఖ్యతను వివరిస్తూ వేదకాలం విషయాలు గుర్తు చేస్తూ భారత ప్రధాని ప్రసంగించారని వెల్లడించింది. దేశం గొప్పతనం, సంస్కృతి విశిష్టత చాటేలా ప్రసంగించారని వెల్లడించింది.

విమర్శలు, వాడివేడి చర్చలకు ఐక్యరాజ్య సమితి వేదిక కాదు అని తెలుసుకున్న నరేంద్రమోడీ దేశ పరువు, ప్రతిష్ట మరింత పెంచేలా ప్రసంగం చేశారని కితాబిచ్చింది. మోడి మాట్లాడిన పంధా సరైనది అని ‘డైలీ టైమ్స్’ కొనియాడింది. ఇక మాడిసన్ స్క్వేర్ లో ఆయన చేసిన స్పీచ్, భారతీయుల నుంచి వచ్చిన స్పందనను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఇదే సమయంలో పాక్ ప్రధాని చేసిన ప్రసంగం అంతగా ఆకట్టుకునేలా లేదని విమర్శించింది. కేవలం ప్రస్తుతం ఉన్న సీరియస్ విషయాలను వివరిస్తూ., విమర్శలను చేస్తూ నవాజ్ షరీఫ్ ప్రసంగించారని తెలిపింది. అదీ నరేంద్రమోడి అంటే ప్రత్యర్ధి దేశంతో కూడా పొగడ్తలు తెప్పించుకునే సత్తా ఆయనలో ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  nawaz sharif  pakisthan media  latest news  

Other Articles