Andhrapradesh government to cancel 7lakhs pensions

andhrapradesh, andhrapradesh government, andhrapradesh government logo, andhrapradesh cabinet, andhrapradesh ministers, andhrapradesh map, andhrapradesh map with out telangana, laetst news, pensions, andhrapradesh pensions, un employed pensions, widow pensions, oldaged pension, latest news, parakala prabhakar, telugu media, october 2

andhrapradesh government takes decission to cancel 7lakhs people pension from october 2 : telugudesam government facing very criticism on pensions scheme babu government removes 7lakhs oldaged names from pension list

ఏడు లక్షల వృద్ధుల ఏరివేత.. పాపం వాళ్ళేంచేశారు బాబు

Posted: 09/25/2014 02:45 PM IST
Andhrapradesh government to cancel 7lakhs pensions

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొట్టకొట్టే పని చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏడు లక్షల మంది వృద్ధులు కడుపు చంపుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే లక్షఎకరాలు అంటూ రైతుల భూములు లాగేసుకోవటానికి కమిటి ఏర్పడగా.. వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ లో కూడా భారీ మార్పులు చేసింది. అనర్హులు అంటూ దాదాపు ఏడు లక్షల మంది పేర్లను పెన్షన్ జాబితా నుంచి తొలగించింది. వీరందరికి అక్టోబర్ 2 నుంచి పెన్షన్ రాదు. అంటే కాటికి కాళ్ళు చాపిన ముసలివారిని ప్రభుత్వం కాస్త త్వరగా పంపించేందుకు కంకణం కట్టుకుంది అనే విమర్శలు వస్తున్నాయి.

వృద్ధాప్యంలో తన అనుకున్న వారు ఆదుకోకపోయినా.., అవసరం కోసం పని చేద్దామన్నా శరీరం సహకరించదు. ఆరుపదుల వయస్సు దాటిన ముసలి వారు ఏమి చేయలేరు. అందుకే వారిని ఆదుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ పధకం తీసుకువచ్చింది. ఈ పధకం కింద ప్రతి నెలా.., రూ.200 ఇస్తోంది. అది వారికి ఏ మాత్రం సరిపోదు. కనీసం మందుల ఖర్చులకు కూడా రాదు. కానీ ఏదో ఇచ్చాము అని చెప్పుకోవడానికి ఉండాలి కదా. అయితే విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ ను భారీగా పెంచింది. రూ. 200 నుంచి ఏకంగా రూ.1000 కి పెంచారు. పేద వృద్ధులు ఎవరిపై ఆధారపడకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా మంత్రులు గొప్పలు చెప్పారు. ఈ పధకాన్ని అక్టోబర్ 2నుంచి అమల్లోకి తెచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.

అభాగ్యులకు అన్యాయం

అయితే వృద్ధాప్య పెన్షన్లపై తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ర్టంలో 7లక్షల మంది పెన్షన్ కు అనర్హులు అంటూ ప్రభుత్వం లెక్కలు తేల్చింది. వారందరికి అక్టోబర్ 2నుంచి పెన్షన్ కట్ చేస్తున్నారు. అంటే వెయ్యి రూపాయల మాట దేవుడెరుగు కానీ.. కనీసం రెండు వందల రూపాయలు కూడా ఆ ఏడు లక్షల మందికి రావన్న మాట. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు అక్రమాలు జరిగాయని పలు ఉదాహరణలు చెప్తోంది. అందులో ఒకటి చూస్తే.. ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ కధ. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రికి పెన్షన్ వస్తుందని.., ఆయన కూడా ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆయనకు పెన్షన్ రాకూడదు. ఇలాంటి వారు ఉండవచ్చు. కానీ తొలగించిన జాబితాలో అంతా ఇలాంటి అక్రమంగా పెన్షన్ పొందే వారే ఉన్నారని మాత్రం చెప్పలేము. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు.

నోటి దగ్గర కూడు లాగేశారు

అక్రమాలను అడ్డుకుంటామంటూ చేపట్టిన పెన్షన్ కొత్త లిస్ట్ రూపకల్పనలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేరుకు అధికారులు అనర్హుల జాబితా తయారు చేసినట్లు చెప్తున్నా.., వాటి రూపకల్పనలో మాత్రం టీడీపీ కిందిస్థాయి నేతలు కీలక పాత్ర పోషించారు. తమ పార్టీకి ఓటేయని.., అవసరం రాని వారు వాస్తవంగా అర్హులైనా.., పేర్లను మాత్రం తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాత లిస్ట్ లో ఉన్న వారిలో తమకు వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను తొలగించి కొత్త జాబితాను టీడీపీ వార్డుమెంబర్లు, నేతలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు తయారు చేశారని విమర్శలు వస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం పెన్షన్ కట్ నిర్ణయం తీసుకుంది. వీరి స్వార్ద ప్రయోజనంతో సగం మంది వృద్ధుల నోటి దగ్గరి కూడు లాగేశారు. లిస్ట్ తయారు చేస్తున్నామనే సాకుతో.., మూడు నెలల ముందునుంచే పెన్షన్ ఆపేశారు. కేవలం పెన్షన్ పైనే ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటి..? దీనికి చంద్రబాబు సమాధానం చెప్తారా.. లేక ఆయన మంత్రులు ముందుకు వస్తారా అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీడియా ఏం చేస్తోంది..?

అన్యాయాలను అడ్దుకోవాల్సిన మీడియా కూడా ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కుల సమీకరణాలు, ప్రాంతీయ భావాలతో పాడయిపోయిన మీడియా వ్యక్తులు.., ప్రభుత్వానికి కొమ్ముకాసేలా కధనాలు రాస్తున్నారు. సర్కారును భజనలు చేయటం.., టీడీపీ గొప్పలు ప్రచారం చేయటం తప్ప చాలా తెలుగు మీడియా సంస్థలు మరొకటి చేయటం లేదు. అందువల్ల ఈ అంశం అంతగా ప్రభావం చూపలేకపోతుంది. దీంతో ప్రభుత్వం ఆడిందే ఆట.., పాడిందే పాట అన్నట్లుగా మారిపోయింది. గాంధీ జయంతి రోజున ముసలి వారికి వెయ్యి రూపాయలు అందిస్తామంటున్నారు. కానీ అదే మహాత్ముడి జయంతి లక్షల మంది పేద వృద్ధుల జీవితాల్లో చీకట్లను మిగల్చనుంది.

ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇవ్వాలని ముసలి వారు ఎవ్వరూ రోడ్డెక్కలేదు. అయినా సర్కారు దయతలిచి ఇవ్వటం సంతోషకరం. కాని కొంతమంది అక్రమార్కుల కారణంగా.. రాజకీయ కోణంలో చూసి వాస్తవ లబ్దిదారులను కూడా అనర్హులుగా ప్రకటించటం అన్యాయం. అలా చేస్తే ఎవరూ ఆదరించని వృద్ధులను ప్రభుత్వం కూడా అభాగ్యులుగా వదిలేసినట్లే అవుతుంది. వారం రోజుల్లో ఏపీ సర్కారు మనసు మారి.., ముసలి వారి గురించి ఆలోచించాలని అంతా కోరుకుందాం. హే రామ్...

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  chandrababu naidu  oldage pensions  latest news  

Other Articles