Delhi zoo officials says white tiger vijay will not kills human beings

delhi zoo, delhi zoo killing, delhi zoo incident, delhi zoo boy killed, delhi zoo tiger, delhi zoo latest, white tiger, tiger kills youth, tiger kills boy in delhi zoo, latest news, delhi news, national news

delhi zoo official told to media that the tiger which killed boy maksood on tuedsay is actually not kills human beings : white tiger of delhi zoo name is vijay that not kills man, now its in observation says zoo curator

ఢిల్లీ జూ పులి మనుషుల్ని చంపదట.. ఆరోజు

Posted: 09/25/2014 03:53 PM IST
Delhi zoo officials says white tiger vijay will not kills human beings

ఢిల్లీ జూలో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రపంచం మొత్తానికి తెలసు. ఎన్ క్లోజర్ దాటి ప్రమాదవశాత్తు లోపల పడిపోయిన మక్సూద్ అనే వ్యక్తిని ఓ తెల్ల పులి చంపేసింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం కల్గించింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే.., జూలో ఎన్ క్లోజర్ లోకి వ్యక్తి ఎలా పడిపోయాడు. సెక్యురిటీ వైఫల్యంపై విమర్శలు రావటంతో.., జూ క్యూరేటర్ వివరణ ఇచ్చారు. మంగళవారం మక్సూద్ ను చంపిన పులికి.., మనుషుల్ని చంపే స్వభావం లేదన్నారు. అసలు ఆ పులికి వేటాడటం కూడా తెలియదు అన్నారు. ఆ పులి పేరు విజయ్ అని.., 2007సం.లో లక్ష్మణ్ యమున అనే పులులకు ఇది పుట్టింది అని చెప్పారు. పూర్తిగా జూ వాతావరణంలో పెరిగింది కాబట్టి.., ఆటవిక లక్షణాలేమి తెలయదు అన్నారు.

ప్రస్తుతం ఏడేళ్ళ వయస్సున్న విజయ్ పులి ప్రతిరోజు క్రమంతప్పకుండా ఆహారం తీసుకుంటోందని.., ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. మంగళవారం రోజు కూడా ఎప్పట్లాగానే.., పది కేజీల దున్నపోతు మాంసం ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా శుభ్రంగా స్నానం చేయించామని వివరణ ఇచ్చారు. ఎప్పట్లాగే సాయంత్రం నాలుగున్నరకు ఆహారం తీసుకుందన్నారు. ఇక రెండ్రోజుల క్రితం జరిగిన దుర్ఘటన గురించి మాట్లాడుతూ.. చనిపోయిన యువకుడు ఎన్ క్లోజర్ దగ్గరకు వెళ్ళగా.. సెక్యురిటి సిబ్బంది రెండు సార్లు వద్దని వారించారన్నారు. అయితే సెక్యురిటి మరోవైపు చూస్తున్న సమయంలో దగ్గరగా వెళ్లి.. ప్రమాదవశాత్తు.. లోపల పడిపోయాడని చెప్పారు.

ఎన్ క్లోజర్ లో పడిన వెంటనే మక్సూద్ ను విజయ్ చంపలేదన్నారు. మృతుడు కొత్తవ్యక్తి కావటంతో పాటు.,. కొత్తగా ప్రవర్తించటంతో ఆత్మరక్షణగా భావించి దాడి చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అటు యువకుడిని చంపిన తర్వాత కూడా గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించలేదన్నారు. జూ సిబ్బందితో సాధారణంగానే మెలుగుతోందని చెప్పారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచీ విజయ్ ను అబ్జర్వేషన్ లో పెట్టామని.., ప్రస్తుతం బాగానే ఉందన్నారు. అయినా సరే నెలాఖరు వరకు కదలికలను బాగా పర్యవేక్షిస్తామన్నారు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi zoo  white tigar  latest news  animals  

Other Articles