Cm babu says he want to make ap as newzeland in tourism

CM, Chandrababu, AP Tourism, New Zealand, Singapore, AP, Telangana, Hyderabad

CM babu says he want to make ap as newzeland in Tourism

సింగపూర్ చిత్రాలు చాలనుకున్నారా..? బాబూ..

Posted: 09/24/2014 01:33 PM IST
Cm babu says he want to make ap as newzeland in tourism

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల అనుభవంలో చంద్రబాబు నోటి వెంట పదే పదే జాలువరిన పదం.. హైదరాబాద్ నగరాన్ని సింగపూర్ చేస్తానని, అవసరమైతే రాష్ట్రాన్ని సింగపూర్ లా అభివృద్ది చేస్తానని.. అలా చేసేందుకు చాలా వరకు కష్టపడ్డారు కూడా. ఇది ఎవరు కాదనలేని సత్యం. హైదరాబాద్ అభివృద్ది అంతా కాకపోయినా.. కొంత వరకైనా బాబు హయంలో జరిగిందనేది వాస్తవం. హైటెక్ సిటీ మొదలుకుని శిల్సారామం, శిల్పకళా వేదిక, స్పోర్ట్స్ విలేజ్, బాలయోగీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పార్కు ఇలా చాల వరకు శ్రమించారు బాబు.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటారా..? సింగపూర్ గురించేనండి.. ప్రతీ విసయంలోనే సింగపూర్ ను ఆదర్శంగా తీసుకునే చంద్రబాబు.. నిన్న ఒక్కసారిగా మాట మార్చారు. పర్యటక రంగంలో ఆంధ్రరాష్ట్రాన్ని సింగపూర్ లా చేస్తామనాల్సిన ముఖ్యమంత్రి.. న్యూజీలాండ్ మాదిరిగా చేస్తామన్నారు. టూరిజం శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ మాట అన్నారు. అధికారుల, సిబ్బంది అందరూ.. సీఎం గారు నోరు జారారు. సింగపూర్ అన్నడానికి న్యూజీలాండ్ అన్నారు అనుకున్నారంత. అయితే మరోమారు చంద్రబాబు న్యూజీలాండ్ అని ప్రస్తావించే సరికి అందరూ ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. ఏమిటబ్బా.. సింగపూర్ అని చెప్పాల్సిన సీఎం.. న్యూజీలాండ్ అని అంటున్నారని ఆశ్చర్యపోయారు.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ వుంది. తన మిత్రుడు, తెలంగాణ ముఖ్యమంత్రైన కేసీఆర్ ను సింగపూర్ పర్యటనకు ఆహ్వనించింది అక్కడి ప్రభుత్వం. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన కేసీఆర్.. హైదరాబాద్ లో సింగపూర్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని ప్రకటించడంతో పాటు.. అమల్లో పెడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో తాను సింగపూర్ అంటే బాగోదని, న్యూజీలాండ్ కు బాబు షిఫ్ట్ అయినట్లు వున్నారు. దీంతో సింగపూర్ చిత్రాలను చాలకున్నారో ఏమో బాబు గారు.
బాబు గారు న్యూజీలాండ్ ను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారని అక్కడి వారు చెవులు కొరుక్కుంటున్నారు.

కానీ నిజానికి టూరిజం విషయంలో న్యూజీలాండ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఈ ఏడాది మార్చిలో న్యూజీలాండ్ కాన్జ్ యాక్సిక్ పర్యాటక అవార్డును గెలుచుకుంది. పర్యాటక రంగంలో ఔట్ లుక్ ట్రావెలర్ నిర్వహించిన సర్వేలోనూ ప్రపంచ వ్యాప్తంగా ఇష్టమైన గమ్యసాన్థం న్యూజీలాండ్ అని స్పష్టమైంది. గత రెండేళ్లుగా పర్యటక రంగంలో లోన్లీ ప్లానెట్ మ్యాగజీన్ అవార్డలను కైవసం చేసుకుంది. అంతేకాదు అమెరికా, ఇటలీ దేశాలను కాదని పర్యటక రంగంలో ముందుకు దూసుకుపోతోంది న్యూజీలాండ్. అందుకనే చంద్రబాబు పర్యాటక రంగంలో న్యూజీలాండ్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామన్నారని అక్కడున్న వారు అనుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM  Chandrababu  AP Tourism  New Zealand  Singapore  AP  Telangana  Hyderabad  

Other Articles