8years old boy earned 8crores in one year

evan, evan tube, evan tube hd, evan games, evan games review, evan games stories, evan story, youtube evan story, how to earn money from youtube, latest news, inspiring stories, america, russia, games, video games, internet games, online games, games cheats, games cheat codes

8years old boy evan earned 8crore rupees in a year by posting videos in youtube : evan staterd a youtube channel and posted videos by playing and explaining games for chidlren by his channel he earned eight crore rupees in one year

1సం.లో 8ఏళ్ళ పిల్లాడి సంపాదన రూ.8కోట్లు !!

Posted: 09/24/2014 12:40 PM IST
8years old boy earned 8crores in one year

మనం లక్ష రూపాయలు సంపాదించాలి అనుకుంటేనే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఎంత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా.., నెలంతా కష్టపడితే కాని అంత డబ్బు రాదు. ఆ లెక్కన సంవత్సరం అంతా కలిపినా అతడు సంపాందిచేది కేవలం 12లక్షల రూపాయలే. కాని ఇక్కడో పిల్లాడు ఎనమిది కోట్లు సంపాదించాడు. అది కూడా ఏడాదిలోనే కావటం విశేషం. పెరిగిన ఇంటర్నెట్ సౌకర్యం, వినియోగమే ఇవాన్ కు వరమై కోటిశ్వరుడిని చేసింది. ఇంతకీ ఈ అబ్బాయి చేసిందేమంటే.., ఆటలాడటం, వాటి గురించి చెప్పటం. చిన్న పిల్లలకు సంబంధించిన వివిధ బొమ్మలు, కార్టూన్ ఫొటోలు, పజిల్స్ తో ఆటలు ఆడి అవి ఎలా ఉన్నాయో రివ్యూలు చెప్తాడు.

సరదాకు, పిల్లల కోసం బొమ్మలు కొనాలనుకునే వారు, బొమ్మలతో ఎలా ఆడుకోవాలో తెలియని వారు ఈ వీడియోలను చూస్తున్నారు. దీంతో ఇవాన్ ట్యూబ్ కు గిరాకి పెరిగింది. చానెల్ పాపులర్ కావటంతో.., యాడ్స్ కూడా వచ్చిపడుతున్నాయి. దీంతో ఒక్క ఏడాదిలోనే ఇవాన్ కు ఎనమిది కోట్ల రూపాయలు ప్రకటనల ద్వారా వచ్చాయి. సరదాగా నవ్వుకుంటూ.., ఆడుకుంటూ వాటి గురించి చెప్తూ.., ఇంత సంపాదించటం నిజంగా ఆశ్చర్యకరమే. ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కాని.., తన అబ్బాయి ఆడే ఆటలు, చెప్పే మాటలను తండ్రి వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయటం మొదలు పెట్టాడు. కొద్దికాలంలోనే అవి తెగ పాపులర్ కావటంతో వాటినే కొనసాగిస్తున్నాడు.

మనవాడి వీడియోలు చూస్తున్న వారి సంఖ్యను మొత్తం లెక్కేస్తే.., కళ్లు తేలేయక మానరు. ఉదాహరణకు ఈ.ఎస్.పీ.ఎన్ చానెల్ వీడియోలను ఏడాదిలో  320 మిలియన్ల మంది చూస్తుండగా... రెండవ స్థానంలో ఇవాన్ ట్యూబ్ ఉంది. ఇతడి వీడియోలను 280మిలియన్ల మంది చూస్తున్నారు. పాపులర్ వుమెన్ కేట్ పెర్రీ యూట్యూబ్ చానెల్ ను 272 మిలియన్ల మంది చూస్తున్నారు. అంటే కే్ట్ కంటే ఇవాన్ వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. అదండీ ఈ ఎనమిదేళ్ళ అబ్బాయి కధ. కొత్తదనం, అవకాశాలను అందిపుచ్చుకోవటం, సృజనాత్మకత, పట్టుదల ఉంటే అద్బుతాలు చేయటం ఆశ్చర్యం ఏమి కాదని ఇవాన్ నిరూపించాడు. మీరూ ట్రై చేయండి.., కాని జాగ్రత్తగా అడుగులు వేయండి. వెనకా ముందు ఆలోచించి ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : games  reveiw  evan  youtube  

Other Articles