Singapore wants to make andhra pradesh capital a smart city

Singapore, AP capital, Smart city, PM Modi, Singapore's former PM, Goh Chok Tong, Vijayawada

Singapore wants to make Andhra Pradesh capital a smart city

కృష్ణమ్మ తీరాన సింగపూర్ నగరం..

Posted: 09/15/2014 12:52 PM IST
Singapore wants to make andhra pradesh capital a smart city

రాష్ట్ర విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా చరిత్ర పుటలలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రానున్నాయి. ఆంధ్రపద్రేశ్ రాజధాని నగరాన్ని సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు మాటలు త్వరలో నిజం కానున్నాయి. మూడు నెలల తరువాత రాజధానిగా విజయవాడ పేరును ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఇప్పడు సింగపూర్ మాజీ ప్రధాని, ఎమెరిటస్ సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్ కూడా మద్దతు పలికారు. దేశవ్యాప్తంగా ఏక్కడ లేని స్మార్ట్ సిటీని తాము ఏర్పాటు చేస్తామన్నారు. నూతన రాజధాని నిర్మాణంతో పాటు దానిని స్మార్ట్ సిటీ కింద రూపొందించడానికి తాము శ్రమిస్తామని చెప్పారు.

ఎన్డీఏ హయంలో దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీతో తాము ఏపీ రాష్ట్ర రాజధాని నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అంగీకారం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రెండు రోజలు పర్యటనలో భాగంగా తన బృందంతో భారత్ పర్యటనకు వచ్చిన గో చోక్ టోంగ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంతో పాటు స్మార్ట్ సిటీగా రూపొందించే విషయమై ప్రధానితో చర్చించామన్న ఆయన.. ఈ నిర్మాణంలో తాము పలుపంచుకునేందుకు అమితాసక్తిని చూపినట్లు తెలిపారు. భారత్ లో తమ ఐడియాలను అమలు చేయడం ఒక సవాలుగా ఆయన పేర్కొన్నారు.

జనవాసాలకు అనుకూలంగా, నిత్య నూతనంగా వుంటే ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా పేర్కంటామన్న ఆయన.. అక్కడ ప్రజలకు ఎల్లప్పుడు నీరు విద్యత్ అందుబాటులో వుండాలన్నారు. సమర్ధవంతమైన ఘన వ్యర్థాలతో పాటు సామాజిక సామసర్యత వెల్లివిరిసన ప్రాంతాలే స్మార్ట్ సిటీలు ఆయన అభివర్ణించారు. భారత్ లో స్మార్ట్ సిటీల నిర్మాణంలో సింగపూర్ తొలి దేశమని చెప్పుకోచ్చిన ఆయన తాము నిర్మించే నగరం ఆదర్శవంతంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తాము తక్కువ ఆర్థిక వనరులతో ఇముడివున్నందున కేవలం ఒక్క స్మార్ట్ సిటీనే నిర్మించదలిచామని, ఇందులో భాగంగా తాము నిర్మించే ఫ్లాట్ ఫాంను అందరు వినియోగించుకునే వీలు కల్పిస్తామన్నారు. ప్రధాని మోడీ ఆశయాలకు అనుగూణంగా తమ నిర్మాణం వుంటుందన్నారు. ఈ మేరకు తాము అధ్యయనాలు చేసిన అనంతరం నిర్మాణ, రూపకల్పన చేపడతామని గో చోక్ టోంగ్ అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singapore  AP capital  Smart city  PM Modi  Singapore's former PM  Goh Chok Tong  Vijayawada  

Other Articles