Smitha sabarwal willing to go back to collector post

smita sabarwal, ias smitha sabarwal, osd smitha sabarwal smitha sabarwal hot, telangana, akun sabarwal, telangana government, medak, karimnagar, districts, collectors, latest news, andhrapradesh, civil servents, ias, ips

osd to telangana smitha sabarwal willing to go back to her post as collector proposals on talks : smitha sabarwal cant bear cm kcr's heavy work duty so that she wants to go back to her old post collectorate

కేసీఆర్ దగ్గర పనిచేయలేనంటన్న ఐఏఎస్ స్మిత

Posted: 09/15/2014 12:58 PM IST
Smitha sabarwal willing to go back to collector post

స్మితా సబర్వాల్ తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఉత్తమ ఐఏఎస్ లలో ఒకరుగా గుర్తింపు పొందారు. మంచితనం, ప్రజా సేవ పట్ల ఉన్న చిత్తశుద్దిని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్నారు. స్మిత తన దగ్గర ఉంటే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని భావించి మెదక్ కలెక్టర్ గా ఉన్న ఆమెను సీఎం ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటి)గా హైదరాబాద్ తీసుకువచ్చారు. సచివాలయంతో పాటు ఇతర ప్రదేశాల్లో సీఎం అధ్యక్షతన జరిగే ప్రతి సమావేశంలో స్మిత పాల్గొంటారు. ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తూ పాలనలో తోడ్పాటును అందిస్తున్నారు. అయితే ఆమె ఇప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేయలేనని సన్నిహితులతో చెప్తోంది.

తిరిగి తన పోస్ట్ అయిన కలెక్టర్ గా పనిచేసుకుంటానని చెప్తోంది స్మిత. కేసీఆర్ దగ్గర పనిచేయటం కంటే కలెక్టర్ గా ఉండటమే మంచిదిగా భావిస్తోందట. ఇందుకు కారణం పైనుంచి ఉండే ఒత్తిడులే అని తెలుస్తోంది. సీఎం కార్యాలయం అంటే ఉండే రాజకీయ, అధికారిక పనులు అన్ని ఇన్ని కావు. ముఖ్యమంత్రిని కలవాలని వచ్చేవారి వివరాలు, ముఖ్యమంత్రి సమావేశాల షెడ్యూల్ ఇలా అన్ని ఆమే చూసుకోవాలి. దీనికి తోడు ఏదయినా అంశంపై కేసీఆర్ కు సమాచారం,. లెక్కలు అవసరం అయితే వెంటనే అందిచాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయన తీవ్ర ఒత్తిడి కూడా తెస్తారని అధికారులు అంటారు. ఇలా స్మితను కూడా పలు అంశాలపై అవసరమైన సమాచారం వెంటనే ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

ఇంత ఒత్తిడిలో పగలు, రాత్రి అనక పనిచేసి ఏమి ప్రయోజనం అని స్మిత కొంతకాలంగా బాదపడుతుంది. పేరుకు పదవి పెద్దది అయినా.. అంతా ముళ్ళకంపను నెత్తిన వేసుకున్నట్లుందని ఆవేదన చెందుతోందట. అందువల్లే తిరిగి కలెక్టర్ గా వెళ్లిపోతే బాగుండు అనుకుంటోందని సన్నిహితులు అంటున్నారు. జిల్లాలో ప్రజల సమస్యలు తీరుస్తూ.. ప్రభుత్వ పధకాలు అమలు చేస్తూ.. తన పని తాను చేసుకుపోతే మంచి పేరు వస్తుందని ఆలోచిస్తోంది. అటు స్మిత భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం జాతీయ పోలిస్ అకాడమిలో పనిచేస్తున్నారు. ఆయన్ను కూడా రాష్ర్ట సర్వీసులోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. స్మిత కోసం భర్తను దగ్గరకు తీసుకువస్తుంటే.. ఆమె మాత్రం కేసీఆర్ కు దూరంగా వెళ్లిపోతానంటుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smitha sabrwal  collector  telangana  latest news  

Other Articles