Kcr reveals secret behind telangana survey

kcr, telangana, k.chandrashekar rao, kalvakuntla, kcr family, kcr caste, latest news, samagra kutumba survey, telangana survey, survey result, elections, aadhar cards, aadhar cards link, planning commission, telangana survey secrets, telangana, hyderabad

telangna chief minister k. chandrashekar rao reveals secret behind government's survey : a question by palnning commission caused for samagra kutumba survey says telangana cm kcr

సమగ్ర సర్వే సీక్రెట్ చెప్పిన తెలంగాణ సీఎం

Posted: 09/15/2014 11:49 AM IST
Kcr reveals secret behind telangana survey

హిట్లర్ కోరిక.. ప్రపంచ యుద్దానికి దారితీసినట్లు.., ఒక చిన్న ప్రశ్న సమగ్ర కుటుంబ సర్వేకు కారణం అయిందట. అందరి లెక్కలూ తేలుస్తానంటూ.., కేసీఆర్ వీడని పట్టువెనక ఆయనకు జరిగిన అవమానం ఉందని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో కొద్దిరోజల పాటు హల్ చల్ చేసిన ఈ అంశంపై కేసీఆర్ సీక్రెట్ బయటపెట్టారు. సమగ్ర కుటుంబ సర్వే సీమాంధ్రులను ఏరివేయటానికే అని వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ.. అసలు సంగతి చెప్పారు. సమగ్ర సర్వే చేయించటానికి ప్రణాళికా సంఘం (ప్లానింగ్ కమిషన్ ) వేసిన ఓ ప్రశ్న.., చేసిన అవమానం కారణంగా చెప్పారు.

కేసీఆర్ చెప్పిన వివరాల ప్రకారం.., తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక.. నిధుల కేటాయింపు కోసం ప్రణాళిక సంఘం దగ్గరకు వెళ్ళారట. ఆ సమయంలోరాష్ర్టంలోని వివిధ శాఖలు, సంక్షేమ పధకాల అమలు ఇతర అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఎందుకు వికలాంగులు ఎక్కువగా ఉన్నారు అని సంఘం ప్రశ్నించింది. దీంతో సమాధానం చెప్పలేకపోయిన కేసీఆర్.. తనకు తాను అవమానంగా ఫీల్ అయ్యారట. హైదరాబాద్ వస్తుంటే కూడా ఇదే ప్రశ్న ముఖ్యమంత్రి తనను తాను గుచ్చి గుచ్చి ప్రశ్నించుకున్నా సరైన సమాధానం చెప్పలేకపోయారట. ఎక్కడో తేడా కొడుతోంది.., ఎందుకు ఇంతమంది నిజంగా వికలాంగులు ఉన్నారబ్బా అనుకుంటూ తెలంగాణకు వచ్చి విమానం దిగి ఇంటికెళ్ళారు.

తర్వాత జరిగిన ఉన్నతాధికారుల భేటిలో హస్తినలో తనకు జరిగిన అవమానంను వివరించారు. ప్లానింగ్ కమిషన్ ముందు ఏమి చెప్పలేక నిలబడిపోయానని అధికారులకు తెలిపారు. సరైన సమాధానం రావాలంటే సమగ్ర సర్వే చేయాలని అప్పడే కఠినంగానిర్ణయించుకున్నట్లు చెప్పారు. గతంలో జరిగినట్లు కాకుండా అందర్ని ఒకేరోజు సర్వే చేసి అన్ని లెక్కలూ బయటకు లాగాలని తీర్మానించారు. అందుకనే ఎంతమంది వద్దు మొర్రో అన్నా కేసీఆర్ విన్పించుకోలేదు.., తనకు జరిగిన అవమానం ముందు కోర్టు కేసులు, కేంద్రం ప్రశ్నలు చిన్నవిగా భావించి సర్వే చేయించారు. తెలంగాణ అంతా ఒక ఉద్యమంలా ఆ ఒక్క రోజు ఒక్కతాటిపైకి వచ్చేటట్లు చేశారు. అలా ప్లానింగ్ కమిషన్ ప్రశ్న ఫలితమే సమగ్ర కుటుంబ సర్వే అన్నమాట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana survey  kcr  planning commission  latest news  

Other Articles