Which rupee wins in medak by poll

kcr, kotha prabhakar Reddy, sunitha laxma reddy, jaggareddy, harish rao, by election

who will be the winner in medak parlimentary by poll

మెదక్ ఉపఎన్నికలో.. ఏ రూపాయిది విజయం..

Posted: 09/12/2014 11:17 AM IST
Which rupee wins in medak by poll

మెదక్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరింది. ఓటరు తీర్పును ప్రభావితం చేసే పనిలో మూడు ప్రధాని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇప్పడీ స్థానాన్ని ఎవరు గెలుస్తారనే అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సంగారెడ్డి, నర్సాపూర్ నుంచి ఓటమి పాలైన జగ్గారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలను తెలంగాణ ముఖ్యమంత్రి చెల్లని రూపాయలుగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయలను పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా చెల్లబాటు అవుతాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మెదక్ ఉప ఎన్నికలలో ఏ రూపాయి చెల్లుబాటు అవుతుందోనని గ్రామాల నుంచి కేంద్ర స్థాయి వరకు ఆసక్తి నెలకొంది.

గత నెల 20న నోటిఫికేషన్ జారీతో ఒక్కసారిగా మొదలైన ఎన్నికల సందడి మొదలుకాగా తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక ప్రారంభమైనపోరు రోజురోజుకు తీవ్రమవుతూ చివరి రెండు రోజుల్లో పతాకస్థాయికి చేరింది. నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపగా, గజ్వేల్, సంగారెడ్డిల్లో కేంద్రమంత్రులు సదానందగౌడ, ప్రకాశ్ జవదేకర్‌లు బహిరంగ సభల్లో పాల్గొన్ని బీజేపి, టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇక ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టారు. బైక్ ర్యాలీలు, ఓట్ల అభ్యర్థనలతో మోత మోగించారు. ప్రచార గడువు ముగియడంతో శనివారం జరిగే ఎన్నికకు అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లను సిద్ధచేశారు. ఉప ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

మాటలే తూటాలుగా..

మెదక్ లోక్ సభ ఉప పోరులో తమ మాటలనే తూటాలుగా చేసి నేతలు ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీల నేతలంతా జిల్లాలోనే మకాం వేశారు. బై పోల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు ప్రధాన పార్టీలు బీజేపి, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగాయి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను చెల్లని రూపాయలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ అభివర్ణించగా, సీఎం కేసీఆర్ ఖబడ్దార్.. హరీష్.. నీ అంతు చూస్తానంటూ బీజేపి అభ్యర్థి జగ్గారెడ్డి ప్రతివిమర్శలకు దిగారు. అటు కాంగ్రెస్ కూడా తామేమి తక్కువ కాదంటూనే అధికార టీఆర్ఎష్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందంటూ కాంగ్రెస్ సీనియర్లు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు.

ప్రలోభాలకు లేచింది తెర

మెదక్ ఉప పోరు ప్రచారం ముగియడంతో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే తెరచాటు చర్యలకు రాజకీయ పార్టీలు పాల్పడుతున్నాయి. ఓటర్లకు ఎర వేసేందుకు పార్టీలు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాలనీలు, వివిధ సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఓట్లు సాధించేలా వ్యూహాలు రచిస్తున్న నేతలు చాపకింద నీరులా తమ పని తాము చేసుకునిపోయేలా ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయనున్నారు. మరోవైపు పోలీసు యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు, మద్యం పంపిణీ చేపట్టకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బూత్‌కు 5 నుంచి 10వేల వరకు ఇప్పటికే పంపకాలు చేపట్టిన పార్టీలు ఓటర్లను మత్తులో ముంచి ఓట్లు దండుకునేలా పనిచేస్తున్నాయి. ఈసారి ఉప ఎన్నికలో పెద్దఎత్తున సామగ్రిని పంపిణీ చేయకపోయినా విందులు, వినోదాలతో ఓటర్లను తమ వశం చేసుకునే ఆలోచనను అమలు చేస్తున్నాయి. మరోవైపు మహిళలను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు చీరలు, కుంకుమ భరణీలు బహుమానాలుగా అందిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో వున్న డ్వాక్రా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. గ్రూపు లీడర్లకు మూట ముల్లెను మట్టచెప్పేందుకు పార్టీలు ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇక మగవారికి మద్యంతో పాటు విందులు ఏర్పాటు చేసి తమ వైపు తప్పికునేందుక రాజకీయా పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kotha prabhakar Reddy  sunitha laxma reddy  jaggareddy  by election  

Other Articles