Why other telugu channels silent over ban on tv9 and abn

tv9, ban on tv9, tv9 ban in telangana, abn, ban on abn, adn andhrajyothy, radhakrishna, kcr, ktr, harish rao, hyderabad, telangana, assembly, tv9 on telangana assembly, journalists, prakash jawadekar, governor, narasimhan, latest news, ntv telugu, sakshi tv telugu, studio n, raj news, tv5 telugu news, hmtv, telugu news channels

descussion started that why other telugu channels are mum over the ban on tv9 and abn in telangana : rumors that government of telangana warned other channels to not interfere in ban issue

మిగతా చానెల్స్ నోరెందుకు మెదపటం లేదు..?

Posted: 09/12/2014 11:11 AM IST
Why other telugu channels silent over ban on tv9 and abn

టీవీ9, ఏబీఎన్. మీడియా సంస్థల ప్రసారాలు తెలంగాణలో నిలిపేయటం పట్ల పెద్ద దుమారమే రేగుతోంది. ఈ ఇష్యూపై కేంద్రం చాలాసార్లు సీరియస్ అయింది. జాతీయ స్థాయి మీడియాలో కేసీఆర్ కామెంట్లపై ప్రధాన కధనాలు వచ్చాయి, నేతలతో చర్చలు జరిగాయి. ఇలా రెండు చానెళ్ళ నిషేధంపై జాతీయస్థాయిలో స్పందన వస్తున్నా తెలుగులోని మిగతా న్యూస్ చానెళ్లు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా సంచలనం అయితే ఒక వార్తలా ప్రసారం చేస్తున్నాయి తప్ప.., ప్రసారాల పునరుద్దరణ కోసం కలిసి పోరాడటం లేదు.

పోటితో పట్టించుకోవటం లేదా..?

మీడియాలో ఉన్న పోటి తత్వం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగు న్యూస్ మీడియా విషయమంటారా.. దేశంలోనే అత్యధిక న్యూస్ చానెళ్లు ఉన్నది తెలుగు మీడియాలోనే. పార్టీకో పేపరు.., నేతకో చానెల్ అన్నట్లుగా పుట్టగొడుగుల్లా మీడియాసంస్థలు పుట్టుకొచ్చాయి. కేవలం ప్రకటనలే ఆదాయ వనరుగా ఉండే మీడియాకు మార్కెటింగ్ పరిధి తక్కువ. ఉన్నదాంట్లోనే మొత్తం ఊడ్చుకుని తినాలి. దీంతో ఎక్కువ ప్రకటనలను పొందేందుకు సంచలనాలను క్రియేట్ చేసి వార్తలు రాస్తుంటారు. ఇది జనాలకు కూడా తెలిసిపోయింది. ఒకప్పుడు చానెళ్ళు చెప్పే వార్తలనే వాస్తవాలుగా భావించిన ప్రజలు ఇప్పుడు ఏది నిజమైన వార్త.., ఏది అసత్య వార్త అని తెలుసుకునేలా చైతన్యం పొందారు.

అయినా సరే తమకున్న సమాచారంలో సరికొత్తగా సంచలనాలను క్రియేట్ చేస్తూ.., రేటింగ్ రేసుల్లో తొలిస్థానం పొందేందుకు చానెళ్ళు నానా తంటాలు పడుతుంటాయి. వీక్షకుడు చానెల్ మార్చకుండా ఉండేందుకు వేయాల్సిన ఎత్తులున్నీ వేసి రేటింగులు పెంచుకుంటున్నారు. వార్తల కంటే రేటింగులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ దాదాపు అంతా కమర్షియల్ అయిపోయారు. దీంతో కమ్యూనికేషన్ జర్నలిజం కాస్త కమర్షియల్ జర్నలిజం అయింది. ఇప్పుడు ఎవరు వార్తలు ఇచ్చారన్నది కాదు.., ఎంత ముందుగా.., ఎంత సంచలనంగా ఇచ్చామనేదే మ్యాటర్. అలా అయితేనే ఇండస్ర్టీలో ఉంటాం తమ్ముడూ అని జర్నలిస్టు మేధావులే చెప్తున్న పరిస్థితులిప్పడివి.

ఈ రేటింగుల రేసులో ఉన్న అన్ని చానెళ్లు.. తమకు పోట ఎంత తక్కువ అయితే అంత మంచిదని భావిస్తున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అనే సామెతను జాగ్రత్తగా పట్టుకుని.., నిషేధం వస్తే ఓ రెండు పోటి నుంచి తగ్గినట్లే కదా అని అంతా సైలెంట్ అయినట్లు సమాచారం. పోటి తత్వం వల్లనే ఈ రెండు పోతే తాము త్వరగా రేటింగుల్లో పైకి చేరవచ్చనే దుర్బుద్ది మెదడులో చేరిందని విశ్లేషకులు అంటున్నారు. లేకపోతే గండు చీమ కుట్టినా.., గగ్గోలు పెట్టి బ్రేకింగ్ న్యూసులు వేసి డిబేట్లు పెట్టే తెలుగు న్యూస్ మీడియా.., తోటి మీడియా సంస్థలను నిషేదిస్తే చప్పుడు చేయకుండా ఉంటాయా? అని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం నోరు మూయించిందా?

అటు మరో వాదన కూడా విన్పిస్తోంది. ప్రభుత్వమే మిగతా మీడియా సంస్థలను మాట్లాడకుండా చేసిందని ఊహాగానాలు వస్తున్నాయి. మీడియా నిషేధంపై మిగతా తెలుగు చానెళ్లు ఎప్పుడో ఉద్యమానికి సిద్ధమవగా.., తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కొందరు మీ సంగతి కూడా చూడమంటారా? అని  బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో గాలికి పోయే కంపను ఎక్కడో ఎందుకు తగిలించుకోవటం అని వదిలేసి తమ పని తాము చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

కాని ఒకటి మాత్రం నిజం.., ఒకప్పుడు గ్రామీణస్థాయి విలేఖరిపై దాడి జరిగితేనే రాష్ర్ట వ్యాప్తంగా ధర్నాలు జరిగేవి. ఇప్పుడు చానెళ్ళ యాజమాన్యాలపై బహిరంగంగా దాడి చేసినా.. ఏకంగా నిషేధించినా కనీసం ఇది అన్యాయమని ఒక స్ర్కోలింగ్ కూడా రావటం లేదు. ఐక్యంగా పోరాడితే పోయేదేం లేదు.. సమాజాన్ని మార్పు చేసే సత్తా ఉన్న మీడియా ఆలోచన ధోరణిలో ముందు మార్పు రావాలి. వారిలో పట్టుకున్న కమర్షియలిజం., స్వార్ధ బుద్ది తొలగి అన్యాయం ఎక్కడ, ఎవరికి జరిగినా ప్రశ్నించే ధైర్యం చేస్తే జేజమ్మలైనా.. వారి అమ్మమ్మలైనా దిగి రాక తప్పదు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv9  abn  telugu news channels  latest news  

Other Articles