5787 vacancies in nrega

jobs, central government jobs, national rural employment guarantee act, different types of jobs, government jobs

5787 Vacancies in NREGA : central government has released 5787 job vacancies in different segments in NREGA

భారీ ఉద్యోగ మేళా.. ఎన్ఆర్ఈజీఏలో 5787 ఖాళీలు!

Posted: 09/12/2014 01:15 PM IST
5787 vacancies in nrega

నిరుద్యోగులకు శుభవార్త! కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద 5787 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 34 శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. అందులో కో-ఆర్టినేటర్ విభాగంలో 2743, టెక్నికల్ అసిస్టెంట్స్ 1482, ఎమ్ఐఎస్ కో-ఆర్టినేటర్ విభాగంలో 484, అసిస్టెంట్ వైస్ మేనేజర్ - అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ - అకౌంట్స్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 247 ఖాళీలు వున్నట్టుగా పేర్కొంది. ఇంకా మిగిలివున్న ఇతర ఉద్యోగ వివరాలను ప్రభుత్వం తన అఫీషియల్ వెబ్ సైట్ లో పొందుపరిచింది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఆయా విభాగానికి సంబంధించి డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి వుండాలి. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక విధానం వుంటుంది. ojas1.guj.nic.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి.. అందులో పొందుపరిచిన ఆయా ఉద్యోగాలకు అప్లికేషన్లు అవరసరమైన వివరాలతో భర్తీ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల వివరాలను సెప్టెంబర్ 21, 2014 లోపు చేసుకోవలసి వుంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jobs  nrega  central government  unemployed people  

Other Articles