Ys family murderd paritala ravi alleges sunitha

paritala ravi, paritala ravi murder, modhu seenu, suri murder, faction, rayalaseema, raktha charitra movie, paritala sunitha, jagan, ys family, ys rajashekar reddy, ysr congress, latest news, ap assembly, tdp, andhrapradesh, politics, crime news

paritala sunitha alleges ys family only murderd his husband ravi : ys family murderd ravi case must re opend and should re enquired demands sunitha

నా భర్తను వైఎస్ కుటుంబమే చంపింది- సునీత

Posted: 08/24/2014 11:54 AM IST
Ys family murderd paritala ravi alleges sunitha

ఏపీలో ఇప్పుడు రాజకీయ హత్యలపై చర్చ జరుగుతోంది. బడ్జెట్, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ హత్యలపై చర్చలతో అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా రాష్ర్టంలో సంచలనం రేపిన పరిటాల రవి హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లు.., రాజకీయ హత్యలపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ.., ఇదే అంశంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. విమర్శలు ఎదుర్కుంటోంది. వైఎస్ కుటుంబంపై పరిటాల సునీత తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు వైఎస్ కుటుంబమే కారణంగా ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ర్టంలో ఎవరిని అడిగినా చెప్తారన్నారు. హత్య కేసులో నిందితులకు వైఎస్ కుటుంబంతో సంబంధాలున్నాయని చెప్పారు.

పరిటాల రవి హత్య కేసును తిరిగి విచారణ జరిపించాలని కార్యకర్తలు, రవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. హత్యా రాజకీయాలపై చర్చకు డిమాండ్ చేస్తున్న వైసీపీ రవి హత్యపై సమాధానం చెప్పాలన్నారు.  ఇక అసెంబ్లీలో జగన్  వ్యవహరిస్తున్న తీరుపై సునీత నిప్పులు చెరిగారు. జగన్ వైఖరి చూసి వైసీపి నేతలే సిగ్గుపడుతున్నారని విమర్శించారు. సభలో జగన్ రౌడీయిజం, దౌర్జన్యం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. అయినా ప్రజా సమస్యలేవి లేనట్లు గ్రామాల్లో కొట్లాటల్లో చనిపోయిన వారి గురించి అసెంబ్లీలో చర్చకు పెట్టడం సరికాదన్నారు. రాజకీయ హత్యలపై చర్చ జరిగితే వైసీపీ గోతులే బయపటడతాయి తప్ప.., తమకేమి ఇబ్బంది లేదన్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవి రాయలసీమలో సీనియర్ టిడిపి నేతగా ఎదిగారు. ఆయన తండ్రి బాటలో అనంత జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. అయితే ఫ్యాక్షన్ గొడవల కారణంగా 24 జనవరి 2005న అనంతపురంలోని జిల్లా పార్టీ కార్యాలయం ముందే హత్య చేయబడ్డారు. ఈ హత్య అప్పట్లో రాజకీయ సంచలనం కల్గించింది. ఈ హత్య కేసులో నిందితుడుగా ఉన్న మొద్దు శీను జైల్లో ఓ ఖైదీచే హత్య చేయబడ్డారు. రవి, సూరిని హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కున్న మద్దెల చెరువు సూరిని అతని ప్రధాన అనుచరుడు భానుకిరణ్ హైదరాబాద్ శివారులో హత్య చేశాడు. ప్రస్తుతం భాను జైలులో ఉన్నాడు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paritala ravi  ys family  jagan  paritala sunitha  

Other Articles