Telangana formation a loss to congress says digvijay

congress, aicc, inc, telangana congress, sonia gandhi, rahul gandhi, digvijay singh, telangana congress, meeting, telangana, andhrapradesh, telanagnaa bill, latest news, election result, political parties of india, seemandhra, ys rajashekar reddy, upa

by forming telangana state congress got loss in both states says digvijay singh : congress failed to grab seats in telangana, fails to satisfy andhra people so we lost both says digvijay

తెలంగాణతో నష్టమే... తప్ప లాభం లేదు

Posted: 08/24/2014 12:25 PM IST
Telangana formation a loss to congress says digvijay

వద్దు.., వద్దంటున్నా పట్టుబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తప్పులు తెలుసకుంటోంది. ఆ రోజు విభజన చేయకుంటే బాగుండేది అని ఇప్పుడు బాధపడుతోంది. విభజనతో తమకు ఒరిగిందేమి లేదు. పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఎన్నికల ఫలితాలు చూసుకుని ఆవేదన చెందుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇవ్వటం ద్వారా పార్టికి ఒరిగిందేమీ లేదన్నారు. విభజనతో కాంగ్రెస్ నష్టపోయిందే తప్ప... ఎలాంటి లాభం పొందలేదన్నారు. తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్ ప్రజల్లోకి తీసుకెళ్ళటంతో లోపం జరిగిందన్నారు. అదే విధంగా విభజన నిర్ణయంతో పార్టీపై కోపంగా ఉన్న సీమాంధ్ర ప్రజలను బుజ్జగించటంలో కూడా పార్టీ విఫలమైందని తప్పులు లెక్క చూసుకున్నారు.

అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రక్రియలో కాంగ్రెస్ మాత్రమే దోషిగా నిలబడాల్సి వచ్చిందని దిగ్విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజనపై స్పష్టత ఇవ్వకుండా గందరగోళానికి గురిచేసిన టీడీపిని కూడా రెండు ప్రాంతాల్లో ప్రజలు ఆదరించగా.., కాంగ్రెస్ మాత్రం ఆ మేరకు ఆదరణకు నోచుకోలేదన్నారు. సోనియా వల్లే తెలంగాణ సాధ్యమైందని.., అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్ళలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీమాంధ్రకు కూడా ఉపశమనం కల్గించేలా చేసిన నిర్ణయాలు అక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేదన్నారు.

 

వైఎస్ బ్రతికుంటే బాగుండేది !!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే కాంగ్రెస్ పరిస్థితి బాగుండేదని దిగ్విజయ్ అన్నారు. వైఎస్ నాయకత్వం మరువలేనిదన్నారు. ఆయన మరణం దురదృష్టకరమనీ.., పార్టీకి తీరని లోటుగా అభిప్రాయపడ్డారు. వైఎస్ వల్లే వరుసగా రెండు సార్లు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో పాటు.., యూపీఏ అధికారంలోకి రాగల్గిందన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  digvijay singh  ys rajashekar reddy  latest news  

Other Articles