Ap govt plans to bring film industry to vishakapatnam

vishakapatnam, vizag tour, beach, araku, natural beautis, locations, andhrapradesh, telangana, film industry, tollywood, latest news, chandrababu naidu, ganta srinivas rao, kcr, ktr, film festival

ap government plans to bring tollywood to vishakapatnam with offers : soon film festival will conduct in vishakapatnam says ap minister ganta srinivas rao

విశాఖ వైపు టాలీవుడ్ అడుగులు ?

Posted: 08/24/2014 11:06 AM IST
Ap govt plans to bring film industry to vishakapatnam

సినీ పరిశ్రమ విశాఖకు తరలిపోతుందా అంటే పలువురు విశ్లేషకులు అవుననే చెప్తున్నారు. విభజన తర్వాత తెలుగు సిని ఇండస్ర్టీ ఎటు వెళ్తుందని అనేక చర్చలు జరిగాయి. చివరకు పరిశ్రమ ఎక్కడకూ వెళ్ళదనీ.., తాము సినీ కార్మికులకు అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. దీంతో చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉంటుదని అంతా భావించారు. అయితే మారుతున్న పరిస్థితులు.., కొత్త ఆలోచనలకు అవకాశం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వైపు పరిశ్రమ అడుగులు వేసేలా చేస్తున్నాయి. ఇప్పటికే వైజాగ్ వంటి ప్రాంతాలు షూటింగులకే పరిమితం కాకుండా స్టూడియోల నిర్మాణంకు కూడా వేదికలయ్యాయి. ఇప్పుడిక ఏకంగా ఇండస్ర్టీ ఏర్పాటు చేసే దిశగా వ్యూహరచన జరుగుతోంది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సినీ ప్రముఖుల భేటి ఈ ఊహాగానాలకు మరింత బలం చేకురుస్తోంది.

మంత్రి గంటా శ్రీనివాసరావుతో తెలుగు సినీ దర్శకులు, నిర్మాతలు పలువురు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీకి ఇండస్ర్టీ రావటంపైనే చర్చ జరిగింది. హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమను విశాఖకు తెచ్చేందుకు ప్రయత్నించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. దీనిపై స్పందించిన సినీ ప్రముఖులు పరిశ్రమ తరలిరావటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. ఇండస్ర్టీకి రాయితీలు, అవకాశాలు, ప్రోత్సాహకాలతో పాటు, కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు మంత్రి గంటా సానుకూలంగా స్పందించారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు రాయితీ కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇండస్ర్టీ వస్తుందంటే రాయితీలు ఇస్తామన్నట్లు గుర్తు చేశారు. ఇందుకు సన్నాహకంగా త్వరలోనే విశాఖలో ఫిలిం ఫెస్టివల్ పెట్టాలని నిర్ణయించారు. ధీని నిర్వహణపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఫెస్ట్ ద్వారా వైజాగ్ కు ఉన్న ప్రాముఖ్యతను చాటడంతో పాటు, ఇండస్ర్టీని ఇక్కడకు రప్పించేలా పావులు కదపాలని సమావేశంలో నిర్ణయించారు.

సినిమా షూటింగులు చాలా వరకు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో షూట్ అవుతున్నాయి. దీంతో ఎక్కడో షూట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావటం కంటే షూట్ చేసిన ప్రాంతంలోనే తర్వాతి పని పూర్తి చేసుకుంటే బాగుంటుంది కదా అని భావన కలుగుతోంది. దీనికి తోడు సినీ పరిశ్రమలో చాలావరకు ఆంధ్రాప్రాంతానికి చెందినవారున్నారు. దీంతో సొంత రాష్ర్టంలో పరిశ్రమ ఉంటే బాగుంటుందని వారిలో మెజార్టీ వర్గం భావిస్తోంది. దీనికి తోడు రెండు రాష్ర్టాల్లో పరిశ్రమ ఉండాలని మరికొందరు చెప్తున్నారు. ఎలాగు పరిశ్రమకు అండగా ఉంటామని కేసీఆర్ హామి ఇచ్చారు. ఇప్పుడు అవకాశాలిస్తామని బాబు  రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. దీంతో రెండు రాష్ర్టాల్లో పరిశ్రమను నడపాలని పలువురు ప్రముఖులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా పరిశ్రమ వేళ్ళూనుకున్న హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లటం అంటే సులువైన పని కాదు. చూడాలి మరి కృష్ణానగర్ హైదరాబాద్ లోనే ఉంటుందా.., లేక విశాఖలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేసుకుంటుందా అనేది.  

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishakapatnam  tollywood  latest news  film festival  

Other Articles