Aliens suspect on moon surface nasa release photos

nasa, aliens, aliens movie, aliens attacks, aliens history, aliens true or not, aliens photos, nase photos, moon, moon surface, moon eclipse, lunar eclipse, rockets, videos, aliens videos, latest news

nasa releases aliens on moon surface photo video : for google moon nasa releases photo video shows aliens

చంద్రుడిపై ఏలియన్స్ పాగా ?

Posted: 08/14/2014 11:28 AM IST
Aliens suspect on moon surface nasa release photos

     ఏలియన్స్.., అదేనండి గ్రహాంతర వాసులు అంటే భూమి లాంటి గ్రహాలపై నివసించే మనుషుల్లాంటివారు. వీరిని మనుషులు అని ఖచ్చితంగా చెప్పలేము. అందుకే పక్కింటివారు అన్నట్లుగా.., అవతలి గ్రహం వారు అని పిలుచుకుంటున్నాం. వీరి గురించి ఖచ్చితమైన సమాచారం లేదు కానీ.., వీరు లేరని మాత్రం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కొన్ని దశాబ్దాలుగా ఈ అంశం సమాధానం దొరకని ప్రశ్నగా నానుతోంది. వీటిపై జాడపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా.., ఏలియన్స్ పేరుతో ఎన్నో కధనాలు వచ్చాయి. సినిమాలు కూడా విడుదలయి నిర్మాతల జేబులు నింపాయి. ఇంతకీ ఇప్పుడు విషయం ఏంటంటే... ఏలియన్స్ చంద్రుడిపై పాగా వేశారు. అంతేకాదు ఈ ఊరు మనదిరా.., నేల మనదిరా అంటూ ఎంచక్కా చంద్రుడిపై వాకింగులు చేస్తున్నారు.

    ఇవేవో కాలక్షేపానికి చెప్తున్న కబురు కాదు. నాసా తీసిన ఫొటో ఈ విషయం చెప్తోంది. అవునండి ఇది నిజం. గూగుల్ ఎర్త్ లాగానే త్వరలో గూగుల్ మూన్ ను సిద్దం చేసేపనిలో గూగుల్ ఉంది. దీని కోసం నాసా చంద్రుడి ఫొటోలు తీసి ఇస్తోంది. ఇలా ఫొటోలు తీసినప్పుడే చంద్రుడిపై ఓ మనిషి నీడ కెమెరాకు కన్పించింది. ముందు మనిషి నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక అతని నీడ పడింది. ఇంకేముంది కెమెరా క్లిక్ మన్పించి నాసాకు ఫొటోలు పంపింది. ఈ ఫొటోలు చూసిన నాసా మాత్రం వీరు ఏలియన్స్ అని ధృవీకరించలేదు. అయితే ఫొటోలు చూసినవారంతా ఇది ఖచ్చితంగా ఏలియన్ అని చెప్తున్నారు. ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అప్ లోడ్ అయిన నెలలపు ఇరవై లక్షల మంది గ్రహాంతర వాసి నీడను ఆసక్తిగా చూశారు. వీడియో చూసినవారంతా ఇది ఏలియనే.., ఎనీ డౌట్ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ ఏలియన్స్ నిజం అయితే...

ఏలియన్స్ ఉన్నది ఎంతవరకు నిజమో తెలియదు. కాని వారు నిజంగా ఉంటే.., చంద్రుడిపై తిరుగుతుంటే. మనం విన్న కధనాల ప్రకారం, ఏలియన్స్ మనుషుల కంటే ఎంతో అడ్వాన్స్. తెలివిపరంగా, టెక్నాలజీలో వారుమనకంటే ముందున్నారని విన్నాము. చందమామపై ఇళ్ళు కట్టి అందులో మనుషుల్ని పెట్టే పనిలో నాసా నిమగ్నం అయింది. అటు జాబిల్లిపై ఉండేందుకు ఇప్పటికే చాలామంది బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నారు. కూడా ఈ తరుణంలో వారు అక్కడ ఉంటే అక్కడకు వెళ్ళే మనుషుల పరిస్థితి ఏమిటి. ఇప్పటికే చంద్రుడిపై పాగా వేసిన గ్రహాంతర వాసులు అక్కడకు కొత్తగా వెళ్లే మనుషుల్నిస్వాగతిస్తారా.., లేక కన్నెర్ర చేస్తారా తెలియదు. అంతేకాదు మనుషులు చంద్రుడిపైకి వెళ్ళినట్లు ఏలియన్స్ భూమిపైకి వస్తే..? వినటానికి ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నా సినిమాల్లో చూపించినట్లు భూమాతపై దాడికి దిగితే ఇక అంతే సంగతులు. అలా జరగకూడదని కోరుకుందాం. మనుషులు ఏలియన్స్ బాయ్ బాయ్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aliens  moon  nasa  latest news  

Other Articles