Cell phones can be charged using your voice sound

mobile phones, nanogenerator, nanorod chemicals, Queen Mary University of London, Nokia and Queen Mary University, Nokia, cell phone

Cell phones can be charged using your voice sound: Queen Mary University of London and Nokia have ... to charge a cell phone using everyday background noise

అరిస్తే .. మీ సెల్ ఫోన్ పుల్ ఛార్జీంగ్ !!

Posted: 08/14/2014 10:20 AM IST
Cell phones can be charged using your voice sound

ఒక్కసారి అరిస్తే చాలు ..మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఛార్జీంగ్ అవుతుంది? మీ అరిచిన సరే, లేదా ఏదైన సౌండ్ వినిపిస్తే చాలు.. సెల్ ఫోన్ కు పుల్ ఛార్జింగ్. మీరు బాత్ రూమ్ లో కూనిరాగాలు తీసినా .. సెల్ ఫోన్ ఖూషిగా ఛార్జింగ్ అవుతుంది.

ఈ సదుపాయాన్ని లండన్‌లోని క్వీన్స్‌మేరీ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనల్లో ప్రముఖ సెల్‌ఫోన్ తయారీసంస్థ నోకియా కూడా పాలుపంచుకుంది. వీరు తమ పరిశోధనల్లో భాగంగా శబ్దతరంగాల ఆధారంగా పనిచేసే నానోజనరేటర్ ప్రొటోటైప్‌ను తయారుచేశారు. ఈ నానోజనరేటర్ రకరకాల ధ్వనులను విద్యుత్‌శక్తిగా మార్చి సెల్‌ఫోన్‌ను చార్జి చేస్తుంది.

ఇలా ఛార్జింగ్ అవుతుంది..!!

ఇందులో ఉండే నానోరాడ్లు శబ్దతరంగాలు అంటే కనీసం మనుషుల కంఠస్వరానికి కూడా కంపించి హైవోల్టేజి విద్యుత్‌ను తయారుచేస్తుంది. ఈ రాడ్లకు ఇరువైపులా ఉన్న విద్యుత్ వాహకాలు ఆ విద్యుత్‌ను సెల్‌ఫోన్‌కు సరఫరా చేసి ఫోన్‌ను చార్జి చేస్తాయి. సాధారణంగా విద్యుత్ వాహకాలుగా ఖరీదైన బంగారాన్ని వాడతారు. కానీ ఈ చార్జర్‌లో బంగారానికి బదులు అల్యూమినియం పొరను వాడడంతో ఖరీదు బాగా తగ్గిపోయింది. ఈ చార్జర్ 5వోల్టుల విద్యుత్‌ను తయారుచేయగలదు. ఓ సాధారణ ఫోన్‌ను చార్జి చేయడానికి ఈ వోల్టేజి సరిపోతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nokia  Queen Mary University  Mobile phones  latest Mobile phones  cell phone  

Other Articles