Telangana government posted t survey duty to nine month pregnant woman

telangana government, T survey duty, Mega Survey in Telangana, Household survey, Telangana survey, Telangana State, Family Survey, nine month pregnant woman

telangana government posted T survey duty to nine month pregnant woman: The intensive household survey that the Telangana government proposes to conduct across the new state on August 19

దారుణం- నిండు గర్బిణికి టి-సర్వే డ్యూటీ !

Posted: 08/14/2014 10:40 AM IST
Telangana government posted t survey duty to nine month pregnant woman

ఇది చాలా దారుణమైన విషయం అని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఆడవాళ్లకు ప్రత్యేక రాయితీలు, సెలవులు ఉన్న విషయం తెలిసిందే. అదీ కూడా గర్బిణీ మహిళలకు ప్రత్యేక రాయితీలు ఏ ప్రభుత్వ అయినా కల్పిస్తుంది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఒక గర్భిణికి పట్ల. ఘోరంగా ప్రవర్తించింది.

నిండు గర్బిణికి తెలంగాణ సర్వే డ్యూటీ వేయటం జరిగింది. దీంతో ఆ మహిళ అధికారులకు ఎంత చెప్పుకున్న వినే నాథుడే లేడు. గర్భిణీలకు ఎలాంటి మినహాయింపు లేదని కరఖండిగా చెప్పటంతో.. ఆమె పరిస్థితి అయోమయంలో పడింది. 19 తేదీ దగ్గరపడుతున్న కొద్ది.. ఆ నిండు గర్భిణీలో టెన్షన్ మొదలైంది.

సెకెండ్ గ్రేడ్ టీచర్ గా అంబర్ పేటలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న హెచ్. నీరజ తొమ్మిది నెలల గర్భవతి. సర్వేలో పాల్గొనాలని ఆమెకు ఆదేశాలు అందడంతో... ఏవీ కళాశాలలో జరుగుతున్న సర్వే శిక్షణ తరగతులకు హాజరై తాను తొమ్మిది నెలల గర్భిణినని... 19 న జరిగే సర్వేలో పాల్గొనలేనని అధికారులకు మొరపెట్టుకుంది.

తొమ్మిది నెలల గర్భిణి అయినప్పటికీ... సర్వే నుంచి మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని ఆమెకు అధికారులు తేల్చి చెప్పారు. తన పరిస్థితిని మానవీయకోణంలో కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని నీరజ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తొటి మహిళ టీచర్లు, కొన్ని మహిళ సంఘాలు.. తెలంగాణ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. రేపు ఆ నిండు గర్బిణీకి జరగరానిది ఏదైన జరిగితే. ప్రభుత్వ అధికారులే భరించాలని మహిళ టీచర్లు అంటున్నారు. ఇలాంటి కష్టాలు..తెలంగాణలో ఏ ఆడబిడ్డకు రాకూడదని .. ఆ నిండు గర్భిణి కోరుకోవటం అక్కడున్న మహిళ అధికారుల మనసును కరిగించింది కానీ, 19 తేదీ తెలంగాణ సర్వే డ్యూటీ మాత్రం తప్పలేదు!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Household survey  Telangana survey  Telangana State  Family Survey  August 19  

Other Articles