Telangaana eamcet counselling

telangaana higher education counselling, eamcet counselling, telangaana news, ap news, students, engeneering colleges in telangaana andhrapradesh, top engeneering colleges, fee fee reimbursement

telangaana higher education council decides to held seperate counselling : two telugu states going to held seperate counsellig for eamcet admissions contreversy on eamcet counselling going on

మీకు మీరే..! మాకు మేమే...!!

Posted: 08/12/2014 11:13 AM IST
Telangaana eamcet counselling

ఏదో ఒకటి చేయకపోతే మనకు ఎలా గుర్తింపు వస్తుంది చెప్పండి. మనం చేసే పనిలో అయినా ప్రత్యేకత ఉండాలి లేదా ప్రత్యేకంగా పని చేయాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండూ చేస్తోంది. మనం మాట్లాడుకుంటోంది ఎంసెట్ కౌన్సిలింగ్ గురించిలెండి. ఎంసెట్ కౌన్సిలింగ్ గడవులోపు పూర్తి చేయక తప్పదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏం చేస్తారో తెలియదు కానీ సెప్టెంబర్ 1కి కాలేజిలో క్లాసులు జరగాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ఇక చేసేది లేక తెలంగాణ ప్రభుత్వం కౌన్సిలింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. సరేలే అనుకునే లోపు మరో వివాదంకు రానే వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీల్లోని ఇంజనీరింగ్ కాలేజిలు, ఇతర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలు ఒకే ఉన్నత విద్యా మండలి ద్వారా జరిగేవి. ఎంసెట్ కౌన్సిలింగ్ వివాదంతో, మీతో మాకేంటి పని అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా సపరేటు ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసుకుంది. అంటే మిగిలింది. అప్రకటిత ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అన్నమాట. ఇది కూడా బాగానే ఉంది కాని ఇక్కడే మొదలైంది అసలు ట్విస్టు.

సీట్ల భర్తీ ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు?

తెలంగాణ ప్రభుత్వం తమ కౌన్సిలింగ్ తామే నిర్వహించుకుని తమ అడ్మిషన్లు తామే పూర్తి చేసుకుంటామని చెప్తోంది. దీంతో మరో వివాదం మొదలవనుంది. తెలంగాణలో ఉన్న కాలేజిలన్ని తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. వీటిలో చట్టంప్రకారం ఏపీ విద్యార్థులకు కేవలం పదిహేను శాతం సీట్లే ఉంటాయని టీఎస్ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్తున్నారు. అయితే విద్యార్థుల ప్రవేశాలు పది సంవత్సరాల పాటు ఎలాంటి మార్పులు చేయవద్దని సుప్రీం కోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. తెలంగాణలోని ప్రధాన కాలేజిల్లో పదిహేను శాతం సీట్లు పూర్తయ్యాక.., ఏపీ నుంచి మెరిట్, తక్కువ ర్యాంకు ఉన్న విద్యార్థి సీటు కోరకున్నా వారు నాన్ లోకల్ కోటాకు వస్తారు. అంటే తెలంగాణ విద్యార్థుల సీట్లు భర్తీ చేసుకున్న తర్వాత మిగతావాటిని ఏపీకి కేటాయిస్తారు. దీనివల్ల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.

అటు ఏపీలో కూడా తెలంగాణ విద్యార్థులకు దాదాపు ఇదే తరహా పరిస్థితి ఎదురుకానుంది. అక్కడ సీట్లు పొందే తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ గా పరిగణిస్తారు. దీంతో వారికి ప్రభుత్వ సౌకర్యాలు అందుతాయో లేదో ఇప్పుడే చెప్పలేము. మరోవైపు తెలంగాణ ఉన్నత విద్యామండలి చట్ట బద్దంగా ఏర్పడలేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది కూడా తేలాల్సి ఉంది. విడిపోయి కలిసి ఉందామని విభజనకు ముందు చెప్పిన నేతలు, ఇప్పుడిలా సై అంటే సై అన్నట్లు వ్యహరిస్తున్నారు. మీరు బాగానే ఉంటారు కానీ ఏ సంబంధం లేని విద్యార్థులు మీ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు ప్రభుత్వాల నేతలూ ఆలోచించండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eamcet counselling  telangaana  andhrapradesh students  

Other Articles