Ap erc shocks apgenco over ppas cancellation and good news to telangana

ap genco, telangana state, power problems, telangana power supply, andhra pradesh power problems, andhra pradesh telangana states

ap erc shocks APGENCO over PPAs cancellation and good news to telangana : andhra pradesh erc shocks to APGENCO on power supply to telangana state and ppas cancellation

తెలంగాణాకు తీపి కబురుతో.. ఏపీకి షాకిచ్చిన ‘‘పవర్’’!

Posted: 08/12/2014 10:59 AM IST
Ap erc shocks apgenco over ppas cancellation and good news to telangana

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానురాను కష్టాలు మరీ ఎక్కువగా అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజధాని విషయంలో ఇంకా క్లారిటీ రాక సతమతమవుతుంటే.. ఇప్పుడు తాజాగా మరో వివాదం ఆ రాష్ట్రానికి అగ్గిరాజుకుంది. ఏపీ త్వరలోనే కోలుకోబోతోందని... ప్రపంచంలోనే అగ్రరాష్ట్రంగా తీర్చుదిద్దుకుంటామని ఆ రాష్ట్రప్రభుత్వం కేవలం మాటల్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది కానీ.. తమ రాష్ట్రంలో వున్న లోపాలను సవరించుకోలేక ఆందోళనల్లో మునిగిపోయింది. రైతులకు ఇక రుణాలు మాఫీ అయినట్టేనని మొన్నటివరకు డప్పు వాయించుకున్న ఆ ప్రభుత్వానికి.. కేంద్రం సహకారం ఇచ్చినట్టే ఇచ్చి కోలుకోలేని గట్టి షాక్ నే ఇచ్చింది. ఈ విషయాలను కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు ఏపీకి ‘‘పవర్’’ జబర్దస్త్ గా షాకిచ్చినట్లు తాజా వార్తలు!

ఇక్కడ ‘‘పవర్’’ అంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదులెండి... పవర్ అంటే విద్యుత్ సమస్య. ఏపీ రాష్ట్రం ‘‘పవర్’’ సమస్యలతో కొత్త కష్టాల్లో ఇరుక్కుంటూ... తెలంగాణ రాష్ట్రానికి తీపి కబురును అందిస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో ఇన్నాళ్లవరకు సైలెంట్ గా వున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలి (ఈఆర్సీ) చివరికి స్పందించింది. పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ జెన్ కో వాదనను తోపిపుచ్చుతూ.. 13 పీపీఏల విద్యుత్తులో తెలంగాణకూ యథాతధంగా వాటా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పేసింది. గతంలో ఏపీ జెన్ కో ఇచ్చిన పీపీఏల రద్దు నోటీసు, దానిపై తెలంగాణ ఎస్పీడీసీఎల్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం.. ఏపీ ఈఆర్సీ సోమవారం రాత్రి ఈ తీర్పును వెలువరించింది.

ఏపీ విద్యుత్తు నియంత్రణ చట్టంలోని సెక్షన్-21(5)ను అడ్డంపెట్టుకుని ఏపీ జెన్ కో ఈ పీపీఏలను రద్దు చేయడం చెల్లదని, కేంద్ర విద్యుత్ చట్టప్రకారం అవి చెల్లుబాటు అవుతాయిని ఈఆర్సీ స్పష్టం చేసింది. 13 పీపీఏలకు సంబంధించిన టారిఫ్ ను గత 12ఏళ్ల నుంచి అమలు చేస్తున్నారని... ఇప్పుడు కేవలం ఈఆర్సీ ఆమోదించలేదన్న సాకుతో వాటిని ఉపసంహరించుకోవడం సరియైన పద్ధతి కాదని తెలిపింది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొరత కొంతలో కొంతైనా తీరినట్టేనని తెలుస్తోంది. ఒకవేళ ఏపీ జెన్ కో 13 పీపీఏలను ఉపసంహరించుకున్నప్పటికీ.. తెలంగాణా రాష్ట్రానికి సదరన్ లోడ్ డిస్పాచ్ ద్వారా విద్యుత్ యథాదధంగా జరుగుతుంది. ఇకనుంచి లోయేర్ సీలేరు నుంచి ఉత్పత్తి అయ్యే 725 మెగావాట్లలో 390 మెగావాట్ల విద్యుత్తు అదనంగా తెలంగాణ లభించడం ఖాయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles