Civet coffee highest cost in world

kopi luwak coffee, Coffee making, Cat, Coffee seeds, civet coffee highest cost

civet coffee highest cost in world: Kopi luwak or civet coffee, refers to the seeds of coffee berries once they have been eaten and defecated by the Asian palm

మియ్యాం ..మియ్యాం.. కాఫీ తాగితే గుండెజారిపోద్దట!

Posted: 08/12/2014 11:00 AM IST
Civet coffee highest cost in world

మియ్యాం.. మియ్యాం .. మిల్క్ షేక్ పిల్లి అంటూ.. ఒక సినీ కవి పాట రాసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ పాట అందరి చేత మియ్యాం .. మియ్యాం పాలు తాగించింది. కానీ ఇప్పుడు మియ్యాం లాంటి పిల్లి ,. అది పాలు ఇవ్వదు ! అయినా దాని కాఫీ తాగితే.. గుండెజారిపోవటం ఖాయమని చెబుతున్నారు.

పిల్లి లాంటి పిల్లి.. ! పునుగు పిల్లి . గురించి అందరికి తెలుసు. కానీ దానిలో విశేష గుణాలు గురించి పెద్దగా తెలియదు. పునుగు పిల్లి అంటే ఆ భగవతుడికి చాలా ఇష్టం. పునుగు పిల్లి చర్మంనుండి వెలువడే తైలాన్ని ఏడుకొండల వెంకన్న కు అభిషేకారం చేస్తారని అందరికి తెలుసు.

అయితే ఇప్పుడు ఈ పునుగు పిల్లి కాఫీ తాగితే మాత్రం గుండెజారిపోవటం ఖాయమని , పునుగు పిల్లి అభిమానులు చెబుతున్నారు. ఈ మియ్యాం ..మియ్యాం కాఫీ రేటు ఎంతో తెలుసా? వేల రూపాయల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ ! కోపీ లువాక్ అని పిలిచే ఆ కాఫీ గింజలు ధర కిలో రూ.35 వేలకు పైమాటే. ఖరీదైన రెస్టారెంట్లలో కప్పు కాఫీ ధర రూ.5 వేలు!

ఇంతకీ ఈ కాఫీ ఎలా త యారుచేస్తారంటే.. ముందుగా వీటితో కాఫీ పళ్లను తినిపిస్తారు. పునుగు పిల్లులు వాటిని తిని.. జీర్ణం చేసుకోగా.. మిగిలిపోయిన గింజలను విసర్జిస్తాయి. వాటిని ఎండబెట్టి.. అమ్ముతారు. పునుగు పిల్లి విసర్జించిన గింజలతో చేసిన కాఫీ రుచి మృదుమధురంగా ఉంటుందట.

ఎందుకిలా అంటే.. పునుగు పిల్లులకు ఎన్ని కాఫీ పళ్లు పెట్టినా.. నాణ్యమైన వాటినే తింటాయట. పైగా.. వాటి జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్‌ల వల్ల గింజలకు ఆ ప్రత్యేకమైన రుచి వస్తుందట. ముఖ్యంగా ఇండోనేసియాలో ఈ తరహా కాఫీ తయారీ ఎక్కువ.

ఈ మియ్యాం .. మియ్యాం కాఫీ రుచి నచ్చటతో.. పునుగు పిల్లులకు కష్టాలు వచ్చానట్లు తెలుస్తోంది. అడువుల్లో హాయిగా తిరిగే పునుగు పిల్లి, ఇప్పుడు పంజరంలో ఖైదీగా మారిపోతుంది. ఇప్పుడు దీనిపై వన్యప్రాణి హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kopi luwak coffee  civet coffee  civet  kopi luwak in Indonesian  

Other Articles