Errabelli dayakar rao gif

kcr, errabelli dayakar rao, tdp leader, telangana news, section 8, re organisation bill, governor powers in hyderabad

tdp leader errabelli dayakar rao fires on kcr : asks about section 8 in ap re organisation bill about telangana formation

అప్పుడేం చేశారన్నా!

Posted: 08/11/2014 11:36 AM IST
Errabelli dayakar rao gif

గవర్నర్ గిరీ ఈ మాటెత్తితేనే కేసీఆర్ సారు గరం గరం అవుతున్నారు. తెలంగాణలో ఇన్నాళ్ళు సీమాంధ్ర పెత్తనం అనుకుంటే ఇప్పుడు ఈ గవర్నర్ గొడవేంటని తల పట్టుకుంటున్నారు. హైదరాబాద్ లో గవర్నర్ కు ప్రత్యేకాధికారాలుంటాయని కేంద్రం పంపిన లేఖపై సీరియస్ అవుతున్నారు. టైం దొరికినప్పుడల్లా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇటు కేంద్రంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. దొర ఏందిరో వాని పీకుడేందిరో అన్నట్లు.., గవర్నర్ ఏంది మాపై ఆయన అజమాయిషీ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇంతవరకు బాగుంది. తన్నే వాడు ఒకడుంటే తలదన్నేవాడు మరొకరుంటారన్నట్లు.., కేంద్రాన్ని కేసీఆర్ తిడుతుంటే.., సీఎం సారును ఇంకొకరు తిడుతున్నారు. ఆయనే తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. గవర్నర్ గిరీపై ఇవాళ గొడవ చేస్తున్న కేసీఆర్ బిల్లు పాసయినప్పుడు ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. బిల్లు పాసయినప్పుడు ఎంపీగా పార్లమెంటులో ఉన్న వ్యక్తికి గవర్నర్ అధికారాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. సెక్షన్ 8 గురించి ఇప్పుడు సీరియస్ అవుతున్న సీఎం ఏప్రిల్ నెలలో ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
    
అప్పుడేం చేశారు?

తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాసయిన తర్వాత నగరానికి వచ్చిన కేసీఆర్ కు టీఆర్ఎస్ నేతలు ఒంటెలు, గుర్రాలు, కాన్వాయ్ లతో స్వాగతం పలికారు. మరి ఆ సంబరాల సమయంలో సెక్షన్ల లెక్కలు, బొక్కలు ఎందుకు మాట్లాడలేదని ఎర్రబెల్లి ప్రశ్నిస్తున్నారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో మాట్లాడకుండా.., ఎవరినీ మాట్లాడనీయకుండా చేసి తెలంగాణ క్రెడిట్ కొట్టిసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం పబ్బం గడుపుకునేందుకు రోజుకో మాట చెప్తున్నారని మండిపడ్డారు.

గవర్నర్ అధికారాలపై అనవసరంగా మోడి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ద్వజమెత్తారు. బిల్లు పాసయింది యూపీఏ హయాంలో, కేవలం అమలు పరుస్తోంది మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం తెలుసుకోకుండా మోడి ఫాసిస్టు, చంద్రబాబు ద్రోహి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయటం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అనే కనీస పరిణితి లేకుండా తెలంగాణ సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
    
అసలు బాధ్యత ఉందా?

కేసీఆర్ కు నిజంగా ప్రజల గురించి ఆలోచన, బాధ, బాధ్యత ఉంటే, బిల్లు ఆమోదం సమయంలోనే గవర్నర్ అధికారాలపై నాటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందన్నారు. అప్పుడు చప్పుడు చేయకుండా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.., అంతా అయిపోయాక గొడవ చేస్తే ఏం లాభం ఉంటుందన్నారు. కేంద్రంతో సఖ్యతగా, పొరుగు రాష్ర్టాలతో స్నేహంగా ఉంటే పనులు జరుగుతాయి తప్ప.., ఎవరితో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తే ఎవరూ పట్టించుకోరని హితవు పలికారు.

పక్కవారిని చూసి నేర్చుకో!

ఉదాహరణకు విభజన తర్వాత ఏపీలో విద్యుత్ కొరత ఉంటే కేంద్రంతో చర్చించి, సమస్యను చంద్రబాబు పరిష్కరించుకున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం, మాకెవరూ అవసరం లేదన్నట్లు వ్యవహరించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కేంద్రాన్ని విద్యుత్ అడగటం చేతకాని సర్కారు, ప్రశ్నించిన రైతులను కొట్టించటంలో మాత్రం ముందుందని మండిపడ్డారు. అదేవిధంగా ఫీజు రి ఎంబర్స్ మెంట్ పై పనికిమాలిన నిబంధనలు పెట్టి.., కౌన్సిలింగ్ జరగకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు.

మోసం చేసే మనిషిగా అందరికి తెలుసు

కేసీఆర్ పై ఊకదంపుడుగా విమర్శలు ఎక్కుపెట్టిన ఎర్రబెల్లి.., హస్తినలో ఆయనపై ఉన్న టాక్ ఏంటో చెప్పారు. కేసీఆర్ అంటే మోసం చేసే మనిషిగా ఢిల్లీలో తెలుసన్నారు. తనకన్నీ తెలుసనీ.., తనను సంప్రదించే బిల్లులో అంశాలన్ని రూపొందిస్తున్నారని అప్పట్లో డబ్బాలు కొట్టిన కేసీఆర్ కు గవర్నర్ అంశం ఎందుకు తెలియదన్నారు.

కేసీఆర్ కేజ్రివాల్ కావద్దు

కేంద్రంతో ప్రతి విషయంలో గొడవలు పెట్టుకుని.., చివరకు ప్రభుత్వాన్ని కూల్చేసుకున్న కేజ్రివాల్ లా కేసీఆర్ మారవద్దని దయాకర్ రావు హితవు పలికారు. అందరితో సఖ్యతగా ఉండాలి తప్ప సొంత నిర్ణయాలు, విధానాల కోసం ప్రజలను ఫణంగా పెట్టవద్దన్నారు. ప్రయోజనం లేని విషయాల కోసం పంతాలకు పోయి.., పరిస్థితిని చేయి దాటనివ్వద్దని సూచించారు ఎర్రబెల్లి. చంద్రబాబు, నరేంద్ర మోడిని విమర్శిస్తే ఏమి రాదని.., వారిని తిట్టడం మాని ప్రజలకు మంచి చేయటంపై ద్రుష్టి సారించాలన్నారు.

RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  errabelli  telangaana  section 8  governor special powers in hyderabad  

Other Articles