Ebola virus spread by 2 years old boy in south africa guinea country

Ebola virus news, ebola virus guinea country, ebola virus 2 years boy, ebola virus victims, ebola virus treatement, ebola virus causes, ebola virus desease, ebola virus latest news

Ebola virus spread by 2 years old boy in south africa guinea country : the ebola virus firstly spread by a 2 year old children who lived in a small village in guinea country has ate a fruit which is already eaten by bat.

‘‘ఎబోలా వైరస్’’ ఎలా వ్యాప్తి చెందిందో తెలుసా..?

Posted: 08/11/2014 10:17 AM IST
Ebola virus spread by 2 years old boy in south africa guinea country

ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రరాజ్యాలతోపాటు ఇతర దేశాలను కూడా వణికిస్తున్న ‘‘ఎబోలా’’ వైరస్.. రెండేళ్ల బాలుడి ద్వారా వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు స్పష్టతనిస్తున్నారు. ఈ వైరస్ మొట్టమొదటిసారిగా 2013 సంవత్సరంలో ఆఫ్రికా ఖండానికి చెందిన రెండేళ్ల బాలుడిలో ఈ వైరస్ ప్రారంభమైందని వారు గుర్తించారు. ఆఫ్రికా ఖండానికి వున్న పశ్చిమాన వున్న గినియా దేశంలోని గుయ్ కేడో గ్రామంలో నివాసమున్న ఆ రెండేళ్ల బాలుడు ఈ వైరస్ సోకి డిసెంబర్ 6వ తేదీన మరణించాడు.

అతను మరణించిన ఒక వారానికే అతని తల్లి చనిపోయింది. ఆమె చనిపోయిన తరువాత క్రిస్ట్ మస్ రోజు బాలుడి మూడేళ్ల సోదరి మరణించింది. మరో ఐదురోజులకే ఆ బాలుడి నానమ్మ చనిపోయింది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. వారికి అంత్యక్రియలు చేయడానికి వచ్చిన బంధువులకు ఇది సోకింది. ఇక అంతే సంగతులు! ఆ వైరస్ అలాగే ఒకరినుంచి మరొకరికి సోకుతూ సమీపంలో వున్న గ్రామాలకు, పట్టణాలకు విస్తరించింది. దీంతో గుయ్ కేడో గ్రామంతోపాటు పరసర ప్రాంతాల్లో వున్న ప్రజలు తక్కువ సమయంలోనే భారీగా సంఖ్యలో మరణించడం మొదలుపెట్టారు.

జనవరి నెలనుంచి ప్రజలు అనుకోకుండా మరణిస్తున్నప్పటికీ అప్పట్లో దీని గురించి శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. క్రమక్రమంగా దీని ఈ వైరస్ అన్నివైపులా వ్యాప్తి చెందడంతో మార్చి నెలలో ఎబోలా వైరస్ ను గుర్తుపట్టగలిగారు. దీనిని గుర్తించి, అదుపు చేసేటప్పటికీ ఈ వైరస్ గినియా దేశంతోపాటు పక్క దేశాల్లోకి వ్యాప్తి చెందింది. ముఖ్యంగా ఈ వైరస్ గబ్బిలాలు, కోతులు సంపర్కంలో పాల్గొనడం ద్వారా గబ్బిలాల్లో వచ్చిందని.. ఆ గబ్బిలాలు తిని పడేసిన పండ్లను తినడం ద్వారా ఈ వ్యాధి ఆ బాలుడిని సోకివుండవచ్చునని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ebola virus news  ebola virus south africa  ebola virus desease  

Other Articles