Jc diwakar reddy controversial comments on chandrababu naidu behaviour

jc diwakar reddy, jc diwakar reddy news, jc diwakar reddy chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu naidu news, jc diwakar reddy comments chandrababu naidu, loan waiver problems

jc diwakar reddy controversial comments on chandrababu naidu behaviour : former congress senior leader and tdp mp jc diwakar reddy controversial comments on chandrababu naidu behaviour. He said that babu behave like a mental person to solve the loan waiver problems

బాబు పిచ్చోడిలా వ్యవహరిస్తున్నాడు! టీడీపీ ఎంపీ

Posted: 08/11/2014 12:52 PM IST
Jc diwakar reddy controversial comments on chandrababu naidu behaviour

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు అని తేడా లేకుండా నిత్యం శ్రమిస్తుంటే... టీడీపీ పార్టీకే చెందిన ఒక ఎంపీ మాత్రం ఆయన మీద వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ‘‘చంద్రబాబుకు ఏం చేయాలో తెలీక జుట్టుపీక్కుంటూ, పిచ్చివాడిలా వ్యవహరిస్తున్నాడు’’ అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద దుమారంగా మారిపోయాయి. తమ పార్టీకి చెందిన ఎంపీయే తమ నాయకుడిపై ఇలా చెప్పడంపై టీడీపీ నాయకులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ ఎంపీ మరెవ్వరో కాదు... అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.

నిజంగా చెప్పుకోవాలంటే.. జేసీ దివాకర్ రెడ్డి, చంద్రబాబుపై ఇలా పిచ్చోడు అంటూ చెప్పడానికి ఆయన అభిప్రాయం వేరేగా వుంది. ముఖ్యమంత్రిగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడం కోసం చంద్రబాబు చాలా కసరత్తు చేస్తున్నాడని.. వాటికోసం ఆయన నిద్రహారాలు మాని నిత్యం శ్రమిస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే! అయితే ఈ అంశాలనే ఆయన కొలిక్కి తీసుకురావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా జుట్టుపీక్కుంటూ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నట్టుగా దివాకర్ రెడ్డి అభివర్ణించడం జరిగింది. బాబు రాష్ట్రాభివృద్ధికోసం చాలా కష్టపడుతున్నాడని ఆయన ఇలా పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. జేసీ దివాకర్ రెడ్డి కావాలనే చంద్రబాబు మీద ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్థాయికి మించిన పనులను తన నెత్తి మీద పెట్టుకుని బాబు అవస్థలు పడుతున్నట్టుగా ఆయన అభిప్రాయం వినిపిస్తుందని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. దివాకర్ రెడ్డి ఇలా వ్యంగ్యంగా కాకుండా.. మరోవిధంగా బాబుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసివుంటే బాగుండేదని అందరూ చర్చించుకుంటున్నారు.

అయినా కొన్ని సందర్భాల్లో జేసీ దివాకర్ రెడ్డికి ఇటువంటి కామెంట్లు చేయడం కొత్తేమీ కాదు. వైఎస్ మరణించిన తరువాతే ఈ తరహా వ్యాఖ్యలు గుప్పించి అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయారు. అలాగే మొన్న రోశయ్య, నిన్న కిరణ్ ల వ్యవహారాల మీద కూడా ఈయన తనదైన శైలిలో వారిని తిట్టిపోస్తూ కామెంట్లు చేశాడు. ఇప్పుడు తాజాగా ఆయన ఎంపీగా కొనసాగుతున్న టీడీపీ పార్టీ అధ్యక్షుడిమీదే వ్యంగ్యంగా అభిమానించడాన్ని చూసి అందరూ వివిధరకాలగా ఈయనమీద తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రానురాను ఇది మరెన్ని వివాదాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles