Ap cm chandrababu and telangana cm kcr shakes hand each other at begaumpet airport

cm kcr and Ap cm Chandrababu, Naidu Shakes Hands with KCR, Begumpet Airport, Pranab Mukherjee

ap cm chandrababu and telangana cm kcr shakes hand each other at begaumpet airport: Andhra Pradesh CM Chandrababu Naidu and Telangana CM KCR shaken hands each other and then both unitedly welcomed President Pranab Mukherjee at Begumpet Airpot...

చంద్రబాబు-కేసిఆర్ కలిసి చేతులు ఒత్తుకున్నారు?

Posted: 08/02/2014 05:41 PM IST
Ap cm chandrababu and telangana cm kcr shakes hand each other at begaumpet airport

రెండు రాష్ట్రాలు, గురువు, శిష్యులు బంధం. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు హోదాలో ఉన్నారు. అయితే రాష్ట్ర విడిపోయిన తరువుతా గురువు, శిష్యుల మద్య విబేధాలు, మాటల యుద్దం, సై అంటూ సై అంటూ సవాల్ విసిరుకున్నారు. ఒకరు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరోకరు సీమాంద్ర ప్రజలకు సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు నాయడు... కేసీఆర్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ నేడు కలుసుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలికేందుకు వచ్చిన ఈ ముఖ్యమంత్రులిద్దరూ నవ్వుతూ కలిసి కాసేపు చేతులను ఒత్తుకున్నారు (కరచాలనం) చేసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా చంద్రబాబు పలకరించారు. కెసిఆర్ భుజం తట్టి చంద్రబాబు అభినందించారు. గవర్నర్ నరసింహన్, కెసిఆర్,చంద్రబాబులు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు.బేగంపేట విమానాశ్రయంలో వీరు కలుసుకున్నారు. ఈ తెలుగు చంద్రుల కలియిక చూసి .. సూర్యుడి సైతం .. సిగ్గుపడి.. మేఘాల చాటుకు వెళ్లిపోవటం జరిగింది.

ఈ ఇద్దరు మాట్లాడుకోవటం చూసిన గవర్నర్ నరసింహన్ కు కొద్ది సేపు చేతులు, కాళ్లు ఆడలేదని రాజకీయ నేతలు అంటున్నారు. మొన్నటి వరకు పేపర్లో పులి, సింహాల మాదిరి గాండ్రించిన వీరు ఒక్కసారిగా ఎదురుపడితే ఏదో జరుగుతుందని గవర్నర్ ఊహించుకున్నారు. కానీ అక్కడ మాత్రం ఇద్దరు చంద్రలు చల్లగా నవ్వుకొని, హాయిగా నాలుగు సరద కబుర్లు చెప్పుకొని, కొద్ది సేపు చేతుల ఒత్తుకొని అక్కడ నుండి వెళ్లిపోయారు. తెలంగాణ నేతలు సైతం ఇద్దరు చంద్రుల కలియిక చూసి షాక్ తిన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles