Indian tiger attack on pakistan border people

Indian tigers, india pakistan border, pakistan border villages, pakistan forest department officers, indian forest department officers, indian tiger attack on pakistan, indian tiger pakistan border, indian pakistan army officers, india border line, pakistan border line, telugu news, movie news, political news, crime news, tollywood news

Indian tiger attack on pakistan border people : An Indian Tiger attacked pakistan villagers and the forest department officers continously for ten to fifteen days who are live at pak-india border and finally pak officials caught that.. read the full story on teluguwishesh.com

పాక్ ను వణికించిన భారత పులి!

Posted: 08/04/2014 10:47 AM IST
Indian tiger attack on pakistan border people

పాకిస్తాన్ వంటి దేశాన్నే మన భారతదేశానికి చెందిన ఒక పులి ముచ్చెమటలు పట్టించింది. పాకిస్తాన్ లో వున్న గ్రామాలకు కొన్నిరోజులపాటు కునుకులేకుండా చేసింది. ఇండియా, పాకిస్తాన్ ల మధ్య వున్న సియాల్ కోట్ సరిహద్దుకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో వున్న కోటమానల్ అనే గ్రామంలోకి మన భారత పులి ప్రవేశించింది. ఆ గ్రామంలో వున్న పాడిపశువులతోపాటు ఇద్దరు వ్యక్తులపై కూడా ఆ పులి దాడి చేసింది. ఆ ఒక్క రోజే కాదు.. దానికి సమయం దొరికినప్పుడల్లా ప్రతిరోజు పాక్ సరిహద్దు గ్రామాలపై పులి తరుచుగా దాడి చేస్తుండటంతో.. అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దానిని ఎవ్వరూ అదుపు చేయలేకపోయారు.

పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆ పులి భయంతో పట్టపగలు సమయంలో కూడా బయటకు రాకుండా తలుపులు మూసుకుని కాలక్షేపం చేసుకుంటూ తమ జీవితాన్ని గడిపేవారు. రానురాను దీని అరాచకం మరీ దారుణంగా పెచ్చుమీరిపోతుంటే.. ఆ గ్రామస్థులు పాకిస్తాన్ లో వున్న పంజాబ్ జంతు సంరక్షణ విభాగ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఆ అధికారులను కూడా ఆ పులి రాత్రింబవళ్లు నిద్ర లేకుండా చేసింది. దొరికినట్టే దొరికి పారిపోయేది. చివరికి అష్టకష్టాలు పడి వారు దానిని పట్టుకోవడంలో సఫలమయ్యారు. పట్టుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా పులిని లాహోర్ నగరంలో వున్న ‘‘జూ’’కి తరలించారు.

ఇటువంటి తరహాలోనే ఇంకొక పులి కూడా ఈ ఏడాది జనవరలో కూడా పాకిస్తాన్ గ్రామాలను వణికించిన సంగతి తెలిసిందే! సియాల్ కోట సరిహద్దుకు 80 కి.మీ. దూరంలో వున్న పార్ సుర్ లోకి ప్రవేశించిన అక్కడున్న అధికారులను, గ్రామస్తులను నిద్రలేకుండా చేసింది. అనంతరం దానిని కూడా పాక్ అధికారులు బంధించారు. ఇలా ఈ విధంగా భారతదేశానికి చెందిన రెండు పులలు పాక్ సరిహద్దులో వున్న గ్రామాల ప్రజలతోపాటు అధికారులను కూడా పరుగులు పెట్టించాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian tigers  india pakistan border  indian forest department offices  

Other Articles