Cbcid investigation demanded on fees reimbursement scheme

CB CID investigation demanded by R Krishnaiah, R Krishnaiah warns of Students stir on fees reimbursement,

CBCID inestigation demanded on Fees Reimbursement scheme by Telangana BC association leader R Krishnaiah

ఫీజ్ రియంబర్స్ మెంట్ మీద సిబిసిఐడి?

Posted: 07/18/2014 11:16 AM IST
Cbcid investigation demanded on fees reimbursement scheme

కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, అవసరమైతే విద్యాసంవత్సరాన్ని పెంచుతామని తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అంటున్నారు కానీ, ఫీజ్ రియంబర్స్ మెంట్ లో జాప్యం మరిన్ని ఆందోళనలకు దారితీస్తోంది.  తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణా లో బిసి సంఘాల నేత ఆర్ కృష్ణయ్య దీని మీద తీవ్ర విమర్శలు చేసారు.  

ఫీజ్ రియంబర్స్ మెంట్ పథకం కుంభకోణాల మయమని కెసిఆర్ అంటున్నారని, అలాంటప్పుడు దాని మీద సిబి సిఐడి దర్యాప్తుకు ఆదేశించవలసిందని ఆర్ కృష్ణయ్య అంటున్నారు.   అంతేకాదు, ఆ కుంభకోణాలకు పాల్పడినవారిమీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

బిసిలు బిచ్చగాళ్ళు కాదని, బిసిల హక్కులను కాలరాయవద్దని అన్న ఆర్ కృష్ణయ్య, ఫీజ్ రియంబర్స్ మెంట్ ను యథాతథంగా అమలు చెయ్యకపోతే విద్యార్థులతో ఉద్యమాలను చేపడతామని, తాను స్వయంగా రంగంలోకి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.  ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణా ప్రభుత్వం బిసిలను విస్మరించిందన్న వేదననాయన వెలిబుచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles