Microsoft company removing employees

microsoft company removing employees, microsoft company, Satya Nadella,

microsoft company removing employees

ఉద్యోగులను పీకిపారేస్తున్న మైక్రోసాఫ్ట్!

Posted: 07/15/2014 12:41 PM IST
Microsoft company removing employees

తమ సొంతలో చేస్తున్న ఉద్యోగులకు పీకిపారేసే పనిలో సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మా సంస్థను అభివృద్ది చేసుకుంటున్నాం అని గొప్పలు చెప్పిన సంస్థ చివరకు ఉద్యోగులు జీవితాలతో ఆటలాడుతుంది.

మైక్రోసాఫ్ట్ తన సిబ్బందిని తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న ఐదేళ్లలో భారీ ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు ఇటీవలే సంస్థ పగ్గాలు చేపట్టిన సత్య నాదెళ్ల సమాయత్తమవుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిన్లాండ్ మొబైల్ తయారీ సంస్థ నోకియాను విలీనం చేసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్ లో మొత్తం సిబ్బంది సంఖ్య 1,27,000 లకు చేరింది.

దీంతో తన ప్రత్యర్థులు యాపిల్, గూగుల్ ల కంటే భారీ స్థాయిలో ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ కలిగి ఉంది. దీంతో ఉద్వాసన ప్రక్రియలో భాగంగా నోకియా నుంచి వచ్చిన ఉద్యోగులతో పాటు తాను నేరుగా నియమించుకున్న సిబ్బందిపైనా వేటు వేసేందుకు సంస్థ సిద్ధమవుతోందట. ఇదిలా ఉంటే, కోతల ప్రక్రియ ఈ వారంలోనే మొదలయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles