Union budget of 2014

union budget 2014, employees salaries of august, finance minister, finance minister arun jaitley

union budget 2014

బడ్జెట్ లో వరాలు ఆగస్ట్ జీతాల నుంచేనా?

Posted: 07/15/2014 12:01 PM IST
Union budget of 2014

కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ లో ఉద్యోగస్తులకు ఇచ్చిన ఆదాయపన్ను రాయితీ ఎప్పటి నుంచి మొదలవుతుందన్న ఉత్కంఠ ఉద్యోగులలో మొదలైంది.  అయితే ఉద్యోగుల పే రోల్స్ లో అవసరమైన మార్పులను ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తర్వాత చేస్తామంటున్నాయి అగ్ర సంస్థలు.

కేంద్ర ఆర్ధిక మంత్రిగా అరుణ్ జైట్లీకి, కొత్తగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది మొట్టమొదటి బడ్జెట్.  అయితే ఇది ఉభయ సభల్లోనూ చర్చలు జరిగి చట్టరూపం దాల్చటం ఇంకా మిగిలివుంది.  కాకపోతే బిల్లులను పాస్ చేసుకోవటానికి ఎన్డియే ప్రభుత్వానికి ఇంతవరకు పెద్దగా ఆటంకాలేమీ రాలేదు.  

ప్రస్తుతమున్న పరిస్థితినిబట్టి ఆర్థిక బిల్లు ఈ నెలాఖరికిల్లా చట్టరూపం దాల్చినట్లయితే ఆగస్ట్ నెల నుంచి ఆ ఆదాయ పన్ను రాయితీల ఫలాలు అందుతాయని సంస్థలు భావిస్తున్నాయి.  

ఏది ఏమైనా ఆగస్ట్ నుంచి మాత్రం తప్పక ఉద్యోగస్తులకు ఆదాయ పన్ను మీద ఎక్కువ మినహాయింపు లభిస్తుందని ఉద్యోగస్తులు ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles