Opposition parties heat on trs party

parliament passes bill on polavaram project, trs party, polavaram ordinance, other parties angry on kcr, opposition parties in telangana, bill on polavaram project passed in lok sabha, other parties, telangana cm k chandrasekhar rao, political heat over polavaram ordinance, polavaram ordinance unconstitutional

opposition parties heat on k chandra sekhar rao

మా అభిప్రాయం తీసుకోరేం? తెరాసను అడుగుతున్న పార్టీలు

Posted: 07/15/2014 01:02 PM IST
Opposition parties heat on trs party

ఏ సమస్యను పరిష్కరించటంలోను ఇతర పార్టీల అభిప్రాయాలను తెలంగాణా రాష్ట్ర సమితి తీసుకోదెందుకని ఆ పార్టీలన్నీ అడుగుతున్నాయి.  అది తెరాస పార్టీ పాలసీయా అని ప్రశ్నిస్తున్నాయి.  తెరాస మీద గట్టి నమ్మకం ఉండబట్టే కదా ప్రజలు పట్టం కట్టారు, అలాంటప్పుడు ఇతర పార్టీలను సంప్రదించవలసిన అవసరం మాకేముంది అనుకుంటుందా అని అడుగతున్నారు ఆ పార్టీల నాయకులు.  

పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపటానికి ఎన్డియే ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ మీద ఆగ్రహించిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విషయంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నదానిలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి నిర్ణయిస్తామని లోగడ చెప్పారు కానీ ఆ పని ఏ కారణం వల్లనో జరగలేదు.  అయితే ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆ బిల్లు మీద ఆమోద ముద్ర పడింది.

ఋణమాఫీలు, ఫీజ్ రియంబర్స్ మెంట్ లాంటి విషయాల్లో మా అభిప్రాయం కూడా తీసుకోవాలంటూ వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడా అడపాదడపా అడుగుతున్నా, తెరాస అవేమీ పట్టించుకోవటంలేదని వాళ్ళ ఆరోపణ.  పోలవరం విషయంలో తానుగానే వేస్తానన్న అఖిలపక్షానికే దిక్కూ దివాణం లేకుండా పోయింది ఇక మిగిలిన విషయాల్లో మేమడిగితే ఆయన అఖిలపక్షాన్ని పిలుస్తారు అంటూ వాపోతున్నారు కొందరు నాయకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles