Amway veiled threat to two divided states

Amway veiled threat to two divided states, Amway direct selling, Directo selling agent of Amway, Amway CEO jailed

Amway veiled threat to two divided states

ఇరు రాష్ట్రాలకు ఆమ్వే బంపర్ ఆఫర్

Posted: 07/15/2014 09:19 AM IST
Amway veiled threat to two divided states

రాష్ట్ర విభజనకు ముందు నుంచే జైలుపాలైన ఆమ్వే సిఇఓ విలియం పింక్నీని విడిపించుకోవటానికి ఆమ్వే కంపెనీ విడిపోయిన రెండు రాష్ట్రాలకు బంఫర్ ఆఫర్ ఇస్తోంది.  

మా పెద్దాయన్ని వదిలిపెట్టండి, మీ రాష్ట్రాలకు పెట్టుబడులు ఎందుకు రావో చూడండి అంటున్నారు.  అంటే, సిఇఓ ని లోపలే ఉంచితే మీకు పెట్టుబడులు ఎలా వస్తోయో చూస్తామన్నట్లుగా ఉంది ఆమ్వే అనే మాట.  న్యాయపరంగా పోరాడితే లాభం ఉండదని తెలిసిపోయినట్లుంది, ఆమ్వే బెదిరింపులకు దిగిందిక.  

పైకి డెరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ ల మని, వ్యాపారంలో మధ్యవర్తులను తీసివెయ్యటంతో ఆ లాభాలను కూడా దీనిలో పనిచేసే ఏజెంట్లకే దక్కుతుందని, మీకు మీరే బాస్ గా మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చని ఇలా ఎన్నో విధాలుగా యువతను ఏజెంట్లగా చేర్చుకుని వాళ్ళకి బంగారు కలలు చూపించిన ఆమ్వే, న్యాయపరంగా ఎక్కడా దొరకనులే అనుకుంది.  కానీ, ధరల దగ్గర దొరికి పోయింది.  

ఆమ్వే ఉత్పాదనలను ఓపెన్ మార్కెట్ లో మిగతా కంపెనీల ఉత్పాదనతో పోటీగా నిలబెట్టలేక అధిక ధరలకు ఏజెంట్ల ద్వారా అంటగట్టే విధానానికి డైరెక్ట్ సెల్లింగ్ అని పేరుపెట్టి చేస్తున్న మోసాన్ని ముందుగా బయటకు లాగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే.  

ఆమ్వే నిలబడిందే ఇతరులకు ఆఫర్లిచ్చి. సంస్థకు ఎంత వస్తుందో ఎప్పుడూ చెప్పదు కానీ ఏజెంట్లకు ఎంత మిగులుతుందో లెక్కకట్టి వాళ్ళని ఊరిస్తుంది. అదే పద్ధతిలో, ఆమ్వేని తన పని తాను చేసుకునేట్లుగా వదిలిపెడితే ప్రభుత్వాలకు ఏం లాభం కలుగుతుందో చెప్తోంది. దానితో పాటు, ఆ పని చెయ్యకపోతే వచ్చే నష్టాన్ని కూడా బెదిరింపులా కాకుండా ఆ ప్రభుత్వాలకు సాయం చేస్తామన్న ముసుగులో బెదిరించే ప్రయత్నం చేస్తోంది ఆమ్వే.

ఖమ్మం లో క్రిమినల్ కేసు లో నిందితుడైన ఆమ్వే సిఇఓ పింక్నీని కర్నూల్ పోలీసులు మే 29న అరెస్టే చేసి కడప జైల్లో ఉంచారు.  ఆ తర్వాత అతన్ని ఖమ్మం పోలీసులకు అప్పజెప్పారు.  మే 30న కోర్టులో హాజరుపరచిన తర్వాత పింక్నీకి జుడిషియల్ కస్టడీ విధించటం జరిగింది.  అతన్ని వరంగల్ సెంట్రల్ జైల్ కి తరలించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles